
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
మాచారెడ్డి: పాల్వంచ సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. భవానీపేట తండాకు చెందిన బూక్య సురేశ్, మాలోత్ తేజ పాల్వంచ నుంచి కామారెడ్డి వైపు బైకుపై వెళుతుండగా, వెనుక నుంచి గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై అనిల్ తెలిపారు.
ఆటో దొంగ అరెస్ట్
ఖలీల్‌వాడి: జీజీహెచ్‌లో ఆటో చోరీ చేసిన నిందితుడిని అరెస్టు చేసినట్లు ఎస్‌హెచ్‌వో రఘుపతి సోమవారం తెలిపారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని సుల్తాన్‌పేట్ గ్రామానికి చెందిన అమృత్వార్ మోహన్ తన చిన్నమ్మ డెలివరీ కోసం ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చారు. ఈ నెల 5న రాత్రి 10 గంటలకు తన ఆటోను జీజీహెచ్ పార్కింగ్ ఏరియాలో నిలిపాడు. మరుసటి రోజు ఉదయం చూసేసరికి ఆటో కనిపించలేదు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టామని ఎస్‌హెచ్‌వో తెలిపారు. సోమవారం మధ్యాహ్నం నగరంలోని బోధన్ బస్టాండ్‌లోని వాహనాల తనిఖీ చేస్తుండగా బర్కత్‌పురాకు చెందిన ఖలీద్ బిన్ మొహమ్మద్‌పై అనుమానంతో విచారించగా చోరీకి పాల్పడినట్లు తేలిందన్నారు. ఆటోను స్వాధీనం చేసుకొని, నిందితుడిని రిమాండ్‌కు తరలించామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment