
ప్రమాదవశాత్తు ఆర్మీ జవాన్ మృతి
సిరికొండ: మండల కేంద్రానికి చెందిన ఆర్మీ జవాన్ కాసుల ప్రమోద్ ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ నెల 1న హైదరాబాద్‌లోని తన గదిలో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రమోద్‌కు తీవ్రగాయాలయ్యాయి. మొదట సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో చేర్పించగా, మెరుగైన చికిత్స కోసం పుణెలోని మిలిటరీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 8న రాత్రి మృతి చెందాడు. ప్రమోద్ స్వగ్రామం సిరికొండలో సోమవారం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ప్రమోద్ భౌతికకాయానికి ఆర్మీ అధికారులతోపాటు సిరికొండ ఎస్సై ఎల్ రామ్ నివాళులర్పించారు. మృతుడికి తల్లిదండ్రులతోపాటు చెల్లెలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment