
పంటలకు సాగునీరందించాలి
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి
సుభాష్‌నగర్: జిల్లాలో భూగర్భజలాలు అడుగంటి సాగునీరందక పంటలు ఎండిపోతున్నాయని, కాలువల కింద ఉన్న పంటలకు తక్షణమే నీరందించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతుకు లేఖ రాశారు. సిరికొండ, ధర్పల్లి, ఇందల్వాయి, మోపాల్, డిచ్‌పల్లి మండలాల్లో బోరుమోటార్లు ఎత్తిపోయి వరి ఎండిపోతోందని ఆవేదన వ్యక్తంచేశారు. మెట్ట ప్రాంతాల్లోని రైతులకు ట్యాంకర్ల ద్వారా, కాలువల కింద ఉన్న పంటలకు సాగునీరు అందించాలని కోరారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు.
మోసగించిన
యువకుడి రిమాండ్
దోమకొండ: ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన కేసులో దోమకొండకు చెందిన యువకుడిని సోమవారం రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై స్రవంతి తెలిపారు. సదరు యువతిని ప్రేమిస్తున్నానంటూ పెళ్లి చేసుకొని లైంగికదాడికి పాల్పడి వదిలివేసినట్లు పేర్కొన్నారు. యువతి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసి యువకుడిని రిమాండ్‌కు పంపినట్లు ఎస్సై తెలిపారు.
బాధితులకు
న్యాయం చేయండి
నిజామాబాద్‌నాగారం: జిల్లాలో అక్షర ఫైనాన్స్ ప్రయివేట్ లిమిటెడ్‌తో మోసపోయిన తమకు న్యాయం చేయాలని బాధితులు ప్రభుత్వాన్ని కో రుతున్నారు. నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో సోమ వారం నిర్వహించిన సమావేశంలో బాధితులు మాట్లాడారు. సదరు ఫైనాన్స్ కంపెనీ యాజ మాన్యం రాష్ట్రవ్యాప్తంగా 72 బ్రాంచీలు పెట్టి మూడు వేల మందిని మోసగించి కోట్లాది రూపాయలు వసూలు చేశారన్నారు. జిల్లా బ్రాంచ్‌లో 72మంది బాధితులకు రూ. 2కోట్ల వరకు చెల్లించాల్సి ఉండగా, ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ఈ విషయమై ప్రజాప్రతినిధులు, అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు.
ఉపాధి హామీ పనుల
సామాజిక తనిఖీ
మాక్లూర్: స్థానిక ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో డీఆర్డీవో సాయాగౌడ్ ఆధ్వర్యంలో సోమవారం ఉపాధి హామీ సామాజిక తనిఖీ నిర్వహించారు. గతేడాది ఉపాధి హామీ పనులు ఏ మేరకు జరిగాయి, ఏఏ పనులు చేశారనే రికార్డులను తనిఖీ చేశారు. కూలీలకు డబ్బులు చెల్లించటంలో ఆలస్యం జరిగిందా జరిగితే ఎందుకు జరిగిందనే వివరాలను ఎఫ్‌ఏలను అడిగి తెలుసుకున్నారు. అలాగే మండల వ్యాప్తంగా కొన్ని గ్రామ పంచాయతీల్లో జరిగిన అవకతవకలపై విచారణ జరిగింది. ఇక ముందు చేపట్టే పనులు ఇతర అంశాలపై ఏపీవో ఓంకార్‌కు డీఆర్డీవో సూచనలు చేశారు. ఈ తనిఖీలో ఎంపీడీవో లక్ష్మారెడ్డి, ఎంపీవో శ్రీనివాస్, సుశీల, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

పంటలకు సాగునీరందించాలి

పంటలకు సాగునీరందించాలి
Comments
Please login to add a commentAdd a comment