
అంకాపూర్‌లో కడప వ్యవసాయాధికారులు
పెర్కిట్(ఆర్మూర్): ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్సార్ కడప జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు సోమవారం సందర్శించారు. వైఎస్సార్ కడప జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఏ నాగేశ్వర్ రావు, డ్వామా పీడీ బీ ఆదిశేషా రెడ్డి, ఉద్యావన శాఖ జిల్లా అధికారి ఎస్‌ఎస్‌వీ సుభాషిణి తదితరులు అంకాపూర్‌లో సాగుచేస్తున్న పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పసుపు ఉడకబెట్టే యంత్రాలు, సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లు, నీటి నిలువ తొట్టెలను పరిశీలించి రైతులు అనుసరిస్తున్న వ్యవసాయ విధానాలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఏపీ ఎంఐపీ పీడీ ఎం వెంకటేశ్వర్ రెడ్డి, డీపీఎం ప్రవీణ్, ఆర్మూర్ ఏడీఏ విజయలక్ష్మి, ఏఈవో అనూష, అంకాపూర్ రైతులు సల్ల అనంత్ రెడ్డి, నారాయణ రెడ్డి, కేకే భాజన్న, జీ భూమా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ రైతులు..
పెర్కిట్(ఆర్మూర్): వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మహ్మదాపురం, గిట్ల కనిపర్తితోపాటు శాయంపేట మండలానికి చెందిన రైతులు అంకాపూర్ గ్రామాన్ని సోమవారం సందర్శించారు. రైతు విజ్ఞానయాత్రలో భాగంగా నాబార్డు సహకారంతో శాంతది సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో అంకాపూర్‌లో పర్యటించారు.
పంటలను పరిశీలించిన బృందం

అంకాపూర్‌లో కడప వ్యవసాయాధికారులు
Comments
Please login to add a commentAdd a comment