అక్రమ నియామకాలు రద్దు చేయాలి
తెయూ (డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీలో గెస్ట్ ఫ్యాకల్టీ నియామకాలు అక్రమ పద్ధతుల్లో జరిగాయని, వెంటనే వాటిని రద్దు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. నూతనంగా నోటిఫికేషన్ విడుదల చేసి నియమనిబంధనల ప్రకారం నియామకాలు చేపట్టాలన్నారు. ఈమేరకు సోమవారం తెలంగాణ యూనివర్సిటీ వీసీ చాంబర్ ఎదుట పీడీఎస్‌యూ, ఏఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ.. ఫిబ్రవరిలో ఇచ్చిన గెస్ట్ ఫ్యాకల్టీ నోటిఫికేషన్ డిపార్ట్‌మెంట్ నోటీస్ బోర్డు మీద తప్ప పత్రిక ప్రకటన ఇవ్వకుండా గోప్యంగా ఉంచారన్నారు. మళ్లీ నోటిఫికేషన్ విడుదల చేసి అర్హులైన నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేలా నియామకాలను చేపట్టాలన్నారు. నాయకులు నరేందర్, కర్క గణేష్, రఘురాం, శివ, చరణ్, రాజు, సంజయ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment