కాంగ్రెస్ పార్టీలో అన్ని వర్గాలకు సమప్రాధాన్యం
నిజామాబాద్ సిటీ: కాంగ్రెస్ పార్టీలో అన్ని వర్గాల వారిని ప్రోత్సహించేవిధంగా సమానమైన ప్రాధాన్యత ఇస్తుందని జిల్లా కాంగ్రెస్ ఎస్టీసెల్ చైర్మన్ కెతావత్ యాదగిరి అన్నారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ భవన్‌లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. త్వరలో జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులను నిర్ణయించడంలో ఏఐసీసీ పెద్దలు సమ న్యాయం చేశారన్నారు. పార్టీలో ముందునుంచి ఉన్నవారు, కాంగ్రెస్ పార్టీనే నమ్ముకుని కష్టనష్టాలను భరించి పార్టీ కోసం పనిచేసినవారికి గుర్తింపు ఉంటుందని మరోసారి నిరూపించారన్నారు. పార్టీని నమ్ముకున్న వారికి పదవులు దక్కుతాయనేందుకు శంకర్ నాయక్ ఎంపిక నిదర్శనమన్నారు. భవిష్యత్‌లో ఉత్తర తెలంగాణ గిరిజనులకు పార్టీలో ఉన్నత పదవులు కల్పించాలని కోరారు. పార్టీ అగ్రనేతలకు ధన్యవాదాలు తెలుపుతున్నా మన్నారు. నాయకులు బున్నె రవీందర్ ఉన్నారు.
నేడు కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
నిజామాబాద్‌రూరల్: రూరల్ నియోజకవర్గంలోని కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం లబ్ధిదారులకు మంగళవారం ఉదయం రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో చెక్కులను పంపిణీ చేయనున్నట్లు కార్యాలయ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి చేతుల మీదుగా చెక్కులను అందించనున్నట్లు వారు తెలిపారు.
‘నవోదయ’పై రాజకీయాలు తగవు
నిజామాబాద్ అర్బన్: జిల్లాలో నవోదయ విద్యాలయం ఏర్పాటుపై అధికార కాంగ్రెస్, బీజేపీ రాజకీయాలు చేయడం సరికాదని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి విఘ్నేష్ అన్నారు. నగరంలోని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాకు వచ్చిన నవోదయ పాఠశాలను కాంగ్రెస్, బీజేపీ సమన్వయంతో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రతినిధులు దీపిక, దినేష్, ఆజాద్, చక్రి, రాజు, వీణ ఉన్నారు.
బోధన్‌లో 4 దుకాణాలు సీజ్
బోధన్‌టౌన్(బోధన్): పట్టణంలో ఆస్తి పన్ను చెల్లించని నాలుగు దుకాణాలను సోమవారం బల్దియా అధికారులు తాళం వేసి సీజ్ చేశారు. బకాయి ఉన్న దుకాణాల్లో బల్దియా అధికారులు పన్ను వసూలు చేస్తున్నారు. అనిల్ టాకీస్ రోడ్డులో రెండు దుకాణాలతో పాటు మరో రెండు దుకాణాలను అధికారులు సీజ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment