కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం
నిజామాబాద్ రూరల్: కాంగ్రెస్ ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. మోపాల్ మండలం తాడెం గ్రామంలో నిర్మిస్తున్న చెక్‌డ్యామ్ పనులకు సోమవారం ఆయన భూమిపూజ చేశారు. అలాగే మాధవ్‌నగర్ బోర్గం(పి), పాంగ్రా గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రెయినేజీ, బీటీ రోడ్డు పనులకు భూమిపూజ చేశారు. అనంతరం ఆర్యనగర్‌లోని రామాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. రూరల్ మండల పరిధిలో తాగునీటి సమస్య లేకుండా చేస్తానని, గ్రామాల్లోని సమస్యలను పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రజల సేవకోసం తన వైద్య వృత్తిని సైతం పక్కకు పెట్టినట్లు వివరించారు. నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, పీీసీసీ డెలిగేట్ బాడ్సి శేఖర్‌గౌడ్, ిసీనియర్ నాయకులు సందగిరి భూమారెడ్డి, గడ్కోల భాస్కర్‌రెడ్డి, సూర్యరెడ్డి, సింగిల్‌విండో చైర్మన్‌లు, చంద్రశేఖర్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, పైస ఎల్లయ్య, సాయారెడ్డి, బోర్గం శ్రీను, చిలుక సాయిలు, గంగాప్రసాద్, రఘు, ఎల్‌ఐసీ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
ఆలయంలో ఎమ్మెల్యే పూజలు
ఇందల్వాయి: మల్లాపూర్‌లో జరుగుతున్న వేంకటేశ్వరస్వామి ఆలయ ఉత్సవాల్లో రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి సోమవారం పాల్గొన్నారు. ఈసందర్భంగా స్వామివారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నవీన్‌గౌడ్, పీసీసీ డెలిగేట్ శేఖర్‌గౌడ్, నాయకులు సంతోష్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
రూరల్ ఎమ్మెలే భూపతిరెడ్డి
పలు గ్రామాల్లో అభివృద్ధి
పనులకు శంకుస్థాపన
Comments
Please login to add a commentAdd a comment