జిల్లా అభివృద్ధికి ఎంపీ అర్వింద్ కృషి
సుభాష్‌నగర్: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ జిల్లా అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు వడ్డీ మోహన్‌రెడ్డి, జిల్లా ప్రధానకార్యదర్శి న్యాలం రాజు అన్నారు. జిల్లా అభివృద్ధిని అడ్డుకుంటున్న బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి ప్రజలకు క్షమాపణలు చెప్పి రాజీనామా చేయాలని డిమాండ్‌చేశారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని హామీనిచ్చిన ఎంపీ అర్వింద్ మాట ప్రకారం పసుపు బోర్డు ఏర్పాటు చేశారని, కేంద్ర కార్యాలయాన్ని కూడా జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేయించారన్నారు. జిల్లాలో సుదర్శన్‌రెడ్డి శకుని పాత్ర పోషిస్తూ, శనిలా మారారని, ఆయనకు భజన బ్యాచ్ సభ్యులైన కొందరు ఎంపీ అర్వింద్‌పై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. అర్వింద్‌పై అసత్య ప్రచారాలు చేస్తూ నోటికొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. నాయకులు నాగోళ్ల లక్ష్మీనారాయణ, రాగి నారాయణ యాదవ్, సుధాకర్ చారి, ఇప్పకాయల కిషోర్, బాల్‌రాజ్, రాంచందర్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment