దృష్టిలోపం ఉన్న విద్యార్థులకు కళ్లద్దాలు అందిస్తాం
మోపాల్(నిజామాబాద్‌రూరల్): జిల్లాలో దృష్టిలోపం ఉన్న విద్యార్థులందరికీ ప్రభుత్వం కంటి అద్దాలను పంపిణీ చేస్తోందని జిల్లా వైద్యశాఖ అధికారి (డీఎంహెచ్‌వో) రాజశ్రీ తెలిపారు. మండలంలోని కంజర్ సాంఘిక సంక్షేమ బాలికల విద్యాలయంలో సోమవారం ఆమె విద్యార్థులకు కంటి అద్దాలు పంపిణీ చేశారు. ఈసందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇటీవల విద్యార్థులకు వైద్య సిబ్బంది కంటి పరీక్షలను నిర్వహించిందని, దృష్టిలోపం ఉన్న వారికి ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేస్తుందన్నారు. అందులోభాగంగా మొదటి విడతలో 1277 కళ్లద్దాలు జిల్లాకు వచ్చాయన్నారు. జిల్లావ్యాప్తంగా ఆర్‌బీఎస్‌కే బృందాల ద్వారా వాటిని పంపిణీ చేస్తున్నామన్నారు. జిల్లా వ్యాధినిరోధక టీకాల అధికారి అశోక్, ప్రిన్సిపాల్ విజయ, మేనేజర్ సచిన్, డాక్టర్ మాధవి, సందీప్, కరీం, సంధ్య, నర్సవ్వ, రఘుపతి, నాగరాజు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment