
అమెరికాలో గత ఏడాది డిసెంబర్ 31న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మంచిర్యాల రెడ్డికాలనీకి చెందిన పెండ్యాల సుబ్రహ్మణ్యం, జ్యోతి దంపతుల కుమారుడు వంశీకృష్ణ(36) మృతి చెందాడు. పదేళ్ల క్రితం అమెరికాకు వెళ్లిన అతను ఆరిజోనా స్టేట్‌లోని ఫోనిక్స్‌సిటీలో ఉంటూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. 31న రాత్రి స్నేహితులతో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకొని రూమ్‌కి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
అమెరికాలోనే ఉంటున్న మృతుడి సోదరి పద్మ దంపతులు ఘటనా స్థలానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. వంశీకృష్ణ మృతదేహాన్ని ఇండియాకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నా.. మంచు అధికంగా ఉండడం వల్ల విమానాలు తగిన సంఖ్యలో నడవడం లేదని తెలిసింది. మృతదేహం మంచిర్యాల చేరేందుకు వారం రోజులు పట్టే అవకాశం ఉందని అంటున్నారు. అక్కడి ప్రభుత్వంతో మాట్లాడి మృతదేహాన్ని త్వరగా పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని మృతుడి తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment