కాకతీయ సాంస్కృతిక పరివారం సింగపూరు వారి ఆధ్వర్యంలో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం పెరుమాళ్ కోవెల ప్రాంగణంలోని పీజీపీ హాలులో ఘనంగా జరుపుకున్నారు. సింగపూరు తెలుగువారితోపాటు, కన్నడ ప్రజలు కూడా ఈ వ్రతంలో పాల్గొనడం విశేషం.
ఎంతో భక్తి శ్రద్దలతో 100 జంటలు ఈ వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. దాదాపు 500 మంది స్వామి వారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వ్రతం చేసుకున్న దంపతులకు స్వామివారి కండువాలు, రూపులను నిర్వాహకులు అందించారు. ఈ అనంతరం స్వామి వారి ప్రసాద వితరణ జరిగింది.
సంస్థ అధ్యకులు రాంబాబు పాతూరి మాట్లాడుతూ కోవిడ్ అనంతరం తమ సంస్థ తరపున జరిపిన మొదటి ప్రత్యక్ష కార్యక్రమాన్ని ఘనవిజయం చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలియచేసారు. అలాగే కార్యక్రమాన్ని అనుకున్న క్షణం నుండీ నిర్విరామంగా శ్రమించిన కమిటీ సభ్యులకు, వాలంటీర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేసారు. తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను రేపటి తరాలకు గుర్తుండే విధంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడం చాలా సంతోషదాయకమని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment