టీసీఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ | Tcss badminton tournament in singapore | Sakshi
Sakshi News home page

టీసీఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో బ్యాడ్మింటన్ టోర్నమెంట్

Published Sun, Feb 26 2023 5:47 PM | Last Updated on Sun, Feb 26 2023 5:48 PM

Tcss badminton tournament in singapore - Sakshi

సింగపూర్‌లోని వుడ్ లాండ్స్ సెకండరీ స్కూల్ స్పోర్ట్స్ హాల్‌లో తెలంగాణ కల్చరల్ సొసైటి సింగపూర్ (టీసీఎస్‌ఎస్‌) ఆధ్వర్యంలో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ - 2023 విజయ వంతంగా నిర్వహించారు. ఈ టోర్నీలో సుమారు 150 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. మొత్తం ఆరు విభాగాల్లో నిర్వహించిన ఈ పోటీల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. మెన్స్ సింగిల్స్, మెన్స్ డబుల్స్, ఉమెన్స్ డబుల్స్, మిక్సుడ్ డబుల్స్, చిల్డ్రన్స్ సింగిల్స్ మరియు చిల్డ్రన్స్ డబుల్స్ కేటగిరీ లలో టోర్నమెంట్ నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.

టీసీఎస్‌ఎస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2023 విజేతల వివరాలు

చిల్డ్రన్స్ సింగిల్స్: విన్నర్-హర్షిత్ కుమార్ రెడ్డి, రన్నర్ అప్- రిత్విక్ రెడ్డి 
చిల్డ్రన్స్ డబుల్స్: విన్నర్స్-రిత్విక్ రెడ్డి & అజయ్ సాత్విక్, రన్నర్ అప్-ప్రజ్వాల్ రాము & భావ దీప్తి 
ఉమెన్స్ డబుల్స్: విన్నర్స్-మాధవి & శ్రీ లక్ష్మీ, రన్నర్ అప్- శ్రద్ధ & సంహిత 
మిక్స్‌డ్ డబుల్స్: విన్నర్స్-బొడ్డు సత్య సంహిత & సురేష్ పోలుకొండ, రన్నర్ అప్- సాయి కృష్ణ & శ్రీ లక్ష్మీ 
మెన్స్ సింగిల్స్: విన్నర్-ఉదయ్ బ్రహ్మానందం, రన్నర్ అప్- సురేష్ పోలుకొండ
మెన్స్ డబుల్స్: విన్నర్-భరద్వాజ్ కేసంశెట్టి & సాయి కృష్ణ సాలేం, రన్నర్ అప్-అన్నం పవన్ కుమార్ & ఉదయ్ బ్రహ్మానందం

ఈ టోర్నమెంట్‌కు సమన్వయ కర్తలుగా నర్రా ఆర్ సి రెడ్డి, గార్లపాటి లక్ష్మా రెడ్డి, గర్రేపల్లి శ్రీనివాస్, దుర్గ ప్రసాద్, బొందుగుల రాము, శివ ప్రసాద్ ఆవుల, వెంకట రమణ నంగునూరి, సతీష్ పెసరు, రవి కృష్ణ విజాపూర్, విజయ్ మోహన్ వెంగళ, పెరుకు శివ రామ్ ప్రసాద్, శశిధర్ రెడ్డి & ప్రవీణ్ మామిడాల వ్యవహరించారు.

ఈ సందర్భంగా సొసైటి సభ్యులు మాట్లాడుతూ.. సింగపూర్ లో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ముందు తరాలకు అందజేయడం కొరకు వివిధ పండుగలను జరుపుకోవడమే కాకుండా ప్రవాస తెలుగు వారిలో క్రీడాస్పూర్తిని పెంపొందించేందుకు వివిధ ఆటల పోటీలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నామన్నారు. ఈ టోర్నీలో పాల్గొని విజయ వంతం చేసిన క్రీడాకారులందరికి కృతజ్ఞతలు తెలిపి, విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ పోటీలను గురించి సొసైటి అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ కుమార్, కోశాధికారి జూలూరి సంతోష్ కుమార్ ఉపాధ్యక్షులు గోనె నరేందర్ రెడ్డి, నల్ల భాస్కర్ గుప్తా మాట్లాడుతూ ఈ సందర్భంగా టోర్నమెంట్ విజయవంతం కావడానికి తోడ్పాటు అందించిన ప్రతి ఒక్కరికి, అంపైర్లకు, ప్రత్యేకంగా అన్నె వంశీ కృష్ణ (జానిక్), రవి కుమార్ నీరుడు (కుమార్ ప్రాపర్టీస్)లకు సొసైటి కార్యవర్గ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement