పేదల బతుకుల్లో వెలుగులు
శ్రమ జీవులు, రైతులు, యువత పక్షాన నిలిచిన వైఎస్సార్ సీపీ
సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా పార్టీ ఏర్పాటు చేసిన వైఎస్ జగన్
ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు పాదయాత్ర చేసిన అధినేత
అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలతో అండగా నిలిచిన వైనం
నేడు వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవం
సాక్షి, మచిలీపట్నం: పేదల బతుకుల్లో వెలుగు నింపేందుకు ఏర్పడిన పార్టీ వైఎస్సార్ సీపీ. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన దుర్మార్గాలు, పేదలు ఎదుర్కొన్న ఇబ్బందులను చూసి చలించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సుపరిపాలన అందించేందుకు నూతన పార్టీ ఏర్పాటు చేయాలని సంకల్పించారు. వైఎస్సార్ కలలను సాకారం చేసేందుకు యువజన, శ్రామిక, రైతుల సంక్షేమమే లక్ష్యంగా వైఎస్సార్ పేరిట పార్టీ ఏర్పాటు చేశారు. 2011 మార్చి 12వ తేదీన పేదలకు ఒక భరోసా, ఆత్మస్థైర్యం నింపుతూ పార్టీకి పురుడు పోశారు. నాడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించిన ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఊరూరూ తిరిగారు. నేటి సంక్షేమ నవోదయానికి నాడే బాటలు వేశారు. ప్రజల గళమై.. వారి పక్షాన నిలిచి.. బలమైన ఉద్యమాలు చేశారు. అనతి కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొంది పేదల మనస్సును చూరగొన్నారు. పాదయాత్ర తరువాత పేదలకు మరింత చేరువైన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గత ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించి, సంక్షేమ పాలనతో ప్రతి గుండెలో పదిలమైన స్థానం పొందారు.
మధ్య ఆంధ్రలో ప్రకటన
వైఎస్సార్ సీపీ ఏర్పాటు ప్రకటనను సీఎం వైఎస్ జగన్ మధ్య ఆంధ్రలోనే చేశారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గంపేట వేదికగా 2011 మార్చి 12వ తేదీన ప్రకటించారు. ఆయన చేసిన ఈ ప్రకటన అప్పట్లో పెను సంచలనం సృష్టిం చింది. పార్టీ జెండా, అజెండాతో అధినేత చేసిన ప్రసంగం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సరికొత్త ఊపు తెచ్చింది. పుష్కర కాల ప్రయాణంలో అనుక్షణం ప్రజల పక్షాన నిలిచి, టీడీపీ, కాంగ్రెస్ లోపాయి కారీ ఒప్పందాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాటానికే వైఎస్సార్ సీపీ ప్రాధాన్యం ఇచ్చింది.
2019లో ప్రభంజనం
అధినేత వైఎస్ జగన్ 2011లో పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి నిత్యం ప్రజల్లోనే గడిపారు. తొలుత ఓదార్పు యాత్ర, రైతు భరోసా యాత్ర, సాగునీటి ప్రాజెక్టు సాధన కోసం దీక్షలు, విద్యార్థుల కోసం ఫీజు పోరు వంటి అనేక కార్యక్రమాలతో ఉద్యమ బాట పట్టారు. చివరకు గత ప్రభుత్వ దుర్మార్గ పాలనను ఎండగడుతూ 2017 నవంబర్ ఆరో తేదీన పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. వైఎస్సార్ కడప జిల్లా ఇడుపులపాయ నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేశారు. అన్ని వర్గాల వారిని పలుకరిస్తూ వారి కష్టాలు, ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. 2014లో టీడీపీ అధినేత చంద్రబాబు అబద్ధపు హామీలతో అధికారంలోకి రావడం, వాటిని అమలు చేయకుండా పేదలను వంచించడమే లక్ష్యంగా పాలించడం, ఆచరణకు సాధ్యం కానీ 600లకు పైగా హామీలను అమలు చేయలేక టీడీపీ వెబ్‌సైట్ నుంచే తొలగించడాన్ని వివరించారు. తాను అధికారంలోకి వస్తే మంచి చేస్తానని ప్రజలకు భరోసా ఇచ్చారు. 2019 జనవరి 11వ తేదీన యాత్రకు ముగింపు పలికి ఎన్నికలకు సిద్ధమయ్యారు. ప్రజా పోరులో 175 అసెంబ్లీ స్థానాల్లో 151 అసెంబ్లీ, 22 పార్లమెంట్ స్థానాల్లో గెలుపొంది చరిత్ర సృష్టించారు.
మరో ప్రభంజనానికి ‘సిద్ధం’
ప్రజా పాలనకు శ్రీకారం చుట్టిన సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప ట్టిన తొలి రోజు నుంచే సంక్షేమ పథకాలు, రాష్ట్రాభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. సచివాలయ వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే పథకాలు అందించేందుకు గ్రామ స్వరాజ్యం తెచ్చారు. కుల మతాలు, రాజకీయ పార్టీలను చూడకుండా అర్హతే ప్రామా ణికంగా నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి నగదును జమ చేశారు. సీ్త్రలు అన్ని రంగాల్లో రాణించేందుకు విద్య, ఉపాధి, సంక్షేమ పథకాల లబ్ధితో పాటు రాజకీయంగా 50 శాతం అవకాశాలు కల్పించి, సమాజంలో గుర్తింపు పెంచారు. మహిళల రక్షణ కోసం దిశ చట్టం, దిశ యాప్, పోలీసు స్టేషన్లు తెచ్చి భద్రత పెంచారు. ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఐదేళ్లలో రూ.2.62 లక్షల కోట్లు డీబీటీ కింద 2.65 కోట్ల మంది లబ్ధిదారుల ఖాతాలోకి నేరుగా జమ చేయగా 1.52 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూర్చారు. దీంతో త్వరలో జరిగే ఎన్నికలకు శంఖారావం పూరించారు. మరోసారి ప్రభంజనం సృష్టించేందుకు ‘సిద్ధం’ అని ప్రకటించారు. సీఎం సభలు, వైఎస్సార్ సీపీ కార్యక్రమాలకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ, స్పందన వచ్చే ఎన్నికల్లో గెలుపు సంకేతాలని రాష్ట్ర ప్రజలు స్పష్టం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment