నిర్లక్ష్యంతో నిర్వీర్యం..
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఎన్నో ఏళ్ల కరకట్ట వాసుల సమస్య అయిన రిటైనింగ్ వాల్‌ను నిర్మించడమే కాకుండా నగర ప్రజలకు ఆహ్లాదకరంగా సేదదీరేందుకు కృష్ణానది ఒడ్డున కృష్ణమ్మ జలవిహార్‌ను ఏర్పాటు చేసింది. పార్కులో వాకింగ్ ట్రాక్‌తో పాటు ఓపెన్ జిమ్, చిన్నారుల ఆటపరికరాలు ఉంచింది. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం పార్కును మూసేసి శిథిలావస్థకు తీసుకొచ్చింది.
– కావాటి దామోదర్, మాజీ కార్పొరేటర్
పరిరక్షించాలి..
టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంబేడ్కర్ స్మృతి వనాన్ని అశ్రద్ధ చేస్తోంది. గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా, రాష్ట్రానికి ఒక ఐకాన్‌గా దీనిని ఏర్పాటు చేసింది. అలాంటి చోట వేరే ఎగ్జిబిషన్లకు అనుమతులిచ్చి పచ్చదానాన్ని పాడు చేస్తున్నారు. కనీస నిర్వహణ లేకపోవడం బాధాకరం. ప్రజాధనం వెచ్చించి నిర్మించిన కట్టడాలను పరిరక్షించాలి.
– పంతాల సాయి, కృష్ణలంక, విజయవాడ
●
నిర్లక్ష్యంతో నిర్వీర్యం..
Comments
Please login to add a commentAdd a comment