కృష్ణా నది తీరాన ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రకృతి అందాలతో రిటైనింగ్ వాల్ వెంబడి అత్యంత సుందరంగా నిర్మించిన కృష్ణమ్మ జలవిహార్(రివర్ ఫ్రంట్ పార్క్) మూత పడింది. కనకదుర్గ వారధి దగ్గర నుంచి పోలీస్ కాలనీ డీపీ స్టేషన్ వరకు 1.25 కి.మీ. పొడవుతో ఈ పార్కును ఆహ్లాదకరంగా అన్ని హంగులతో నిర్మించారు. దీనికోసం రూ.12.3కోట్లను గత ప్రభుత్వం వెచ్చించింది. అయితే చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా కృష్ణా నదికి భారీగా వరద వచ్చింది. ఆ సమయంలో రిటైనింగ్ వాల్‌పైన నీరు ప్రవహించడంతో పార్కులోనికి నీరు ప్రవహించి, వాకింగ్ ట్రాక్‌తో పాటు, కొన్నిచోట్ల లాన్ దెబ్బతింది. అప్పటి నుంచి ప్రజలకు పార్కులోకి ప్రవేశం లేకుండా గేట్లు వేశారు. చిన్న, చిన్న మరమ్మతులను పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి పార్కును తీసుకొని రావడంతో అధికారులు నిర్లక్ష్యం వహించారు. దీంతో ఆరు నెలలుగా పార్కు ప్రజలకు అందుబాటులోకి లేకుండా పోయింది.
Comments
Please login to add a commentAdd a comment