గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రైవేటు బస్సు డ్రైవర్ గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన భవానీపురం పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. విద్యాధరపురం సంజీవ్‌గాంధీ కాలనీకి చెందిన బాలాజీరెడ్డి ప్రైవేటు బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అనారోగ్యం కారణంగా కొద్ది రోజులుగా డ్యూటీకి వెళ్లడం లేదు. 18వ తేదీ సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. అతని భార్య శకుంతల ఫోన్ చేయగా భవానీపురం లారీ స్టాండ్‌లో మందు తాగుతున్నానని సమాధానం ఇచ్చాడు. రాత్రయినా తిరిగి రాకపోవడంతో శకుంతల లారీ స్టాండ్ వద్దకు వెళ్లి చూడగా అక్కడ పడిపోయి ఉన్నాడు. ఏమైందని శకుంతల ప్రశ్నించగా గడ్డి మందు తాగినట్లు చెప్పాడు. దీంతో ఆమె స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చింది. చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మరణించాడు. భవానీపురం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment