
ఒత్తిడి జయించేందుకు క్రీడలు దోహదం
గన్నవరంరూరల్: ఒత్తిడిని జయించేందుకు క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ వి.రాధికారెడ్డి పేర్కొన్నారు. మండలంలోని చిన అవుటపల్లి డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కళాశాల క్రీడా మైదానంలో హెల్త్ యూనివర్సిటీ 26వ పురుషుల ఇంటర్ మెడికల్ గేమ్స్ మీట్‌ను శనివారం ప్రారంభించారు. యూనివర్సిటీ పరిధిలోని అన్ని వైద్య, డెంటల్ కళాశాలల నుంచి క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ.. విద్యా సంవత్సరానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. క్రీడాకారులను డాక్టర్ రాధికా రెడ్డి అభినందించారు. సిద్ధార్థ మెడికల్ కళాశాల యాజమాన్యం ఆమెను సత్కరించింది. కళాశాల డైరెక్టర్ జనరల్ డాక్టర్ చదలవాడ నాగేశ్వరరావు, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎంవి భీమేశ్వర్, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి.అనిల్ కుమార్, హెల్త్ యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ డాక్టర్ త్రిమూర్తి, ఆర్గనైజింగ్ సెక్రటరీ దేవినేని రవి, డాక్టర్ రెహమాన్, హెచ్‌ఓడీలు, వైద్యులు పాల్గొన్నారు.
ఇంటర్ పరీక్షలకు
849 మంది గైర్హాజరు
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఇంటర్మీడియెట్ పరీక్షలకు సంబంధించి శనివారం జరిగిన మొదటి సంవత్సరం పరీక్షలకు 849 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా 103 పరీక్ష కేంద్రాల్లో 39,274 మంది విద్యార్థులకు 38,425 మంది హాజరు కాగా 849 మంది గైర్హాజరయ్యారు. శనివారం మ్యాథ్స్ ఏబీ, జువాలజీ–1, హిస్టరీ–1 పరీక్షలు జరిగాయి. ఒకేషనల్ పరీక్షలకు 1,337 మంది విద్యార్థులకు 1,190 మంది హాజరు కాగా 147 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు.
క్లుప్తంగా
Comments
Please login to add a commentAdd a comment