అన్నింటా మహిళలు రాణించాలి
చిలకలపూడి(మచిలీపట్నం): అన్ని రంగాల్లో మహిళలు రాణించి నేటి సమాజంలో మహిళాసాధికారత దిశగా అడుగులు వేయాలని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక అన్నారు. జిల్లా పరిషత్ ప్రాంగణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కృష్ణమ్మ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం జెడ్పీ సమావేశపు హాలులో జిల్లా పరిషత్ సభ్యులతో పాటు మహిళా ఉద్యోగులతో కలిసి ఆమె కేక్ కట్ చేశారు. దేశస్థాయిలో అత్యున్నత అవార్డు సాధించిన చైర్‌పర్సన్ ఉప్పాల హారికను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ మహిళా సాధికారత కోసం గత ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి వాటిని తూ.చ. తప్పకుండా అమలు చేశారన్నారు. మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు జగనన్న తోడు, జగనన్న ఆసరాతో పాటు అన్ని రంగాల మహిళలకు ఆర్థిక చేయూతను అందించారని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మహిళలకు ఉచితంగా ఇళ్ల పట్టాలు అందజేసి సొంతింటి కలను నెరవేర్చారన్నారు. కార్యక్రమంలో జెడ్పీ డెప్యూటీ సీఈఓ ఆర్సీ ఆనంద్‌కుమార్, జెడ్పీటీసీ సభ్యులు, ఉద్యోగినులు పాల్గొన్నారు.
జెడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక
Comments
Please login to add a commentAdd a comment