
లోక్ అదాలత్‌ను వినియోగించుకోండి
చిలకలపూడి(మచిలీపట్నం): లోక్‌అదాలత్‌ను పెండింగ్‌లో ఉన్న కేసుల కక్షిదారులు వినియోగించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణసారిక అన్నారు. జాతీయ లోక్‌అదాలత్ కార్యక్రమాన్ని న్యాయసేవాసదన్‌లో శనివారం ఆమె ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ జిల్లాలో లోక్ అదాలత్‌ను నిర్వహించడానికి 41 బెంచ్‌లను ఏర్పాటు చేశామన్నారు.
10,428 కేసుల పరిష్కారం
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన లోక్ అదాలత్‌లో 10,428 కేసులు పరిష్కారమయ్యాయని న్యాయమూర్తి తెలిపారు. 9,674 క్రిమినల్ కేసులు, 159 సివిల్ కేసులు, 333 చెక్‌బౌన్స్ కేసులు, 98 మోటారు వాహన ప్రమాద క్లయిమ్‌లకు గానూ రూ. 8.3 కోట్లు నష్టపరిహారంగా చెల్లించేందుకు ఇన్సూరెన్స్ కంపెనీలు అంగీకరించాయన్నారు. ఇవికాక 164 ప్రీ లిటిగేషన్ కేసులను పరిష్కరించి అవార్డులను అందజేశారన్నారు. మచిలీపట్నంలో 1,612 కేసులు, విజయవాడ 5,093, గుడివాడ 754, నందిగామ 239, నూజివీడు 228, మైలవరం 197, జగ్గయ్యపేట 469, బంటుమిల్లి 117, కై కలూరు 788, తిరువూరు 21, గన్నవరం 156, అవనిగడ్డ 228, మొవ్వ 356, ఉయ్యూరు 170 కేసులను పరిష్కరించామన్నారు. కేసుల పరిష్కారంలో రాష్ట్రంలో కృష్ణా రెండోస్థానంలో నిలిచిందని న్యాయమూర్తి తెలిపారు. కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు, న్యాయమూర్తులు కెవీ రామకృష్ణయ్య, చినబాబు, న్యాయశాఖ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment