భాష, సంస్కృతి వికాసానికి కృషి
విజయవాడ కల్చరల్: భాష, సంస్కృతి వికాసానికి కవులు, రచయితలు కృషి చేయాలని ప్రపంచ తెలుగు రచయితల సంఘం గౌరవ అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ అన్నారు. గజల్ చారిటబుల్ సంస్థ, సేవ్ టెంపుల్ ఆధ్వర్యంలో దుర్గాపురంలోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ నృత్య సంగీత కళాశాలలో ఆదివారం ఉగాది వేడుకలు, కవి పండితులకు సత్కారం, జాతీయ కవి సమ్మేళనం నిర్వహించారు. బుద్ధప్రసాద్ మాట్లాడుతూ కవులు సమాజాన్ని అధ్యయనం చేయాలన్నారు. న్యాయవాది వేముల హజరత్తయ్య మాట్లాడుతూ గజల్ సాహిత్యానికి చేసిన సేవలను వివరించారు. గజల్ శ్రీనివాస్ సభకు అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ 2026లో గుంటూరులో మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తునట్లు తెలిపారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలను వివరిస్తూ స్వీయ గజల్‌ను గానం చేశారు. వివిధ రంగాలకు చెందిన గోళ్ళ నారాయణరావు, డోగిపర్తి శంకరావు,చలపాటి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
పరామర్శకు వెళ్తూ అనంతలోకాలకు..
తిరువూరు రూరల్/దమ్మపేట: పరామర్శకు వెళ్తున్న తల్లీకుమారులను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మృత్యువాత పడ్డారు. ఘటన తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గాంధీనగరం గ్రామ శివారులో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం ముష్టికుంట్ల గ్రామానికి చెందిన తల్లీకుమారులు అరిసెపల్లి సరస్వతి(66), అరిసెపల్లి కృష్ణ(49). సరస్వతి సోదరుడి కుమారుడు అనారోగ్యం బారిన పడ్డాడు. వారిని పరామర్శించడానికి తల్లీకుమారులు ద్విచక్రవాహనంపై తెలంగాణ రాష్ట్రం అశ్వారావుపేట మండలం నారంవారిగూడెం గ్రామంలోని బంధువుల ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలో గాంధీనగర్ గ్రామ సమీపంలో గుర్తు తెలియని వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తల్లీకుమారులు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం అంబులెన్స్‌లో ఆశ్వారావుపేటకు తరలించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ సాయికిషోర్‌రెడ్డి తెలిపారు.
ముష్టికుంట్లలో విషాదఛాయలు
తల్లీకుమారుల మృతితో ముష్టికుంట్లలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతుడు కృష్ణ గ్రామంలో నాయీ బ్రాహ్మణ వృత్తితో పాటు, బ్యాండ్ మేళం ట్రూప్‌లో పని చేస్తూ కుటుంబపోషణ చేస్తున్నాడు. అతనికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. అతని కుమారుడు ప్రైవేట్ ఉద్యోగి. కుమార్తెకు వివాహమైంది. కృష్ణ మృతితో కుటుంబం పెద్దదిక్కును కోల్పోయామని భార్యా పిల్లలు కన్నీరు మున్నీరవుతున్నారు. సరస్వతి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో వంట పని చేస్తుంటుంది. 70 ఏళ్ల భర్త వేలాద్రికి చేదోడుగా ఉంటుంది. మరో కుమారుడు మల్లేశ్వరరావు కూలి పని చేస్తూ జీవిస్తున్నాడు. ఒకేసారి ఆ కుటుంబంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందడంతో వారి వేదన వర్ణనాతీతంగా ఉంది.
భాష, సంస్కృతి వికాసానికి కృషి
భాష, సంస్కృతి వికాసానికి కృషి
Comments
Please login to add a commentAdd a comment