ఉమ్మడి కృష్ణా సీనియర్స్ రగ్బీ జట్ల ఎంపిక
నున్న(విజయవాడరూరల్): ఉమ్మడి కృష్ణా జిల్లా రగ్బీ అసోసియేషన్ ఆధ్వర్యాన ఆదివారం నున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీనియర్ పురుషులు, మహిళల జిల్లా రగ్బీ జట్ల ఎంపికలు జరిగాయి. వీటిలో 25 మంది బాలురు, 20 మంది బాలికలు పాల్గొన్నారని కార్యదర్శి ఎన్.చంద్రకళ తెలిపారు. పురుషుల జట్టుకు జి.బిళ్లహరి, సీహెచ్ మోహనవంశీ, ఎం.లక్ష్మీనారాయణ, (విజయవాడ), వై.జిక్రిరెడ్డి (జూనియర్ కళాశాల,పాయకాపురం), కె.రాహుల్(ధనేకుల), నున్న వికాస్‌కు చెందిన పి.సాయి ధనుష్, యు.వెంకట రమణ, ఎండి ఫిరోజ్ జిలానీ,ఎం. లక్ష్మణస్వామి (సంగమూడి), పి.రవినాగ శంకర్‌లు ఎంపికయ్యారు. మహిళల జట్టుకు ఉంగుటూరుకు చెందిన వై.నందిని, ఎస్.కీర్తన, ఒ.సుధారాణి, కె.నందిని, జి.గంగా భవాని, (హనుమాన్ జంక్షన్), విజయవాడకు చెందిన వి.గీతశ్రీ, బి.నిహారిక, సీహెచ్ జాహ్నవి. డి.చిన్ని నున్న కు చెందిన ఎ.గౌతమి, పి.జెస్సికా ఎంపికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment