
మొక్కజొన్నకు ఆధరణ కరువు
కంకిపాడు: మొక్కజొన్న రైతులను ఆదుకోవటంలో కూటమి సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రైతులకు దక్కటం లేదు. దిగుబడులు ఆశాజనకంగా ఉన్నా మార్కెట్‌లో ధర పతనం కారణంగా తీవ్రంగా నష్టపోతున్నారు. కొనుగోలు కేంద్రాలను తెరిపించి మద్దతు ధర దక్కేలా చర్యలు చేపట్టాల్సిన సర్కారు మీనమేషాలు లెక్కించటంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. రోజుకో విధంగా వాతావరణ పరిస్థితులు మార్పు చెందుతుండటంతో రైతుల్లో ఆందోళన అధికమవుతోంది.
11,875 ఎకరాల విస్తీర్ణంలో
మొక్కజొన్న సాగు
కృష్ణాజిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది రబీ సీజన్‌లో 11,875 ఎకరాల విస్తీర్ణంలో మొక్కజొన్న సాగు జరిగింది. 20 రోజులుగా మొక్కజొన్న కోతలు జరుగుతున్నాయి. కండెలు ఎండబెట్టి, యంత్రాలతో గింజ వేరు చేసి కల్లాల్లో ఎండబెడుతున్నారు. గింజ వేరు చేయటం, ఎండబెట్టే పనుల్లో రైతులు, కూలీలు నిమగ్నమయ్యారు. ఎకరాకు కౌలు రూ.12 వేలు, పెట్టుబడులు కింద రూ.35 వేల నుంచి రూ.45 వేల వరకూ రైతులు పెట్టుబడులు పెట్టారు. ఎకరాకు మాగాణి పొలాల్లో 35, మెట్ట పొలాల్లో 45 నుంచి 50 బస్తాల వరకూ దిగుబడులు వస్తున్నాయి.
దళారుల సిండికేట్ మాయ
పంట చేతికి వచ్చి మార్కెట్‌కు తరలించేందుకు రైతులు నానా పాట్లు పడుతున్నారు. పంట రాక ముందు క్వింటా ధర రూ.2400 వరకు పలికింది. ప్రస్తుతం రూ.2 వేలకు మించి పలకటం లేదు. దళారులు అంతా సిండికేటై ధర నిర్ణయం చేస్తున్నారు. ఎక్కడ చూసినా ఆశించిన ధర దక్కటం లేదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం క్వింటా మద్దతు ధర రూ.2,225గా నిర్ణయించింది. ఆ ధర కూడా చేతికి అందకపోవటంతో ఆర్థికంగా నష్టపోతున్నామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు అకాల వర్షాలు, మారుతున్న వాతావరణ పరిస్థితులు కారణంగా ఎప్పుడెలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందోనన్న భయం రైతులను వణికిస్తోంది.
మూడు ఎకరాల్లో మొక్కజొన్న కౌలు చేశాను. పంట చేతికొ చ్చింది. కంకిపాడు యార్డులో ఆరబెడుతున్నాం. మార్కెట్‌లో గిట్టుబాటు రేటు లేదు. కొనుగోలు కేంద్రం తెరిస్తే మొక్కజొన్న పంట విక్రయించాలని అనుకుంటున్నాం. కేంద్రం ఎప్పుడు తెరుస్తారో? ఏమో? అర్థం కావటం లేదు.
– గడ్డం రాజా, కౌలురైతు,
గొడవర్రు, కంకిపాడు మండలం
నేను మూడు ఎకరాల్లో మొక్క జొన్న సాగు చేశాను. మాగాణిలో 30 నుంచి 35 బస్తాలు, మెట్టలో 45 బస్తాల పైగా దిగుబడులు వస్తున్నాయి. ప్రభుత్వం చెప్పిన మద్దతు ధరకు మార్కెట్‌లో ధరకు పొంతన లేదు. క్వింటా ధర రూ.2 వేలకు మించి పలకటం లేదు. బయటి వ్యాపారులే కొనుగోలు చేస్తున్నారు.
– కాటూరి శివప్రసాద్, కౌలురైతు,
వల్లూరుపాలెం, తోట్లవల్లూరు మండలం
వైఎస్సార్ సీపీ పాలనలో రైతులకు ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలిచి భరోసా అందించింది. రబీ సీజన్‌లో కురిసిన అకాల వర్షాలతో పంట దెబ్బతిని నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. అప్పటి వరకూ క్వింటా రూ.1600 మాత్రమే ధర పలికి ఆర్థికంగా నష్టపోతున్న పరిస్థితి. ఆ స్థితిలో యుద్ధప్రాతిపదికన కొనుగోలు కేంద్రాలను తెరిచి కొనుగోళ్ల విషయంలో నిబంధనలు సడలించి మొక్కజొన్న కొనుగోళ్లు సాగేలా నాటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవ టంతో రైతులకు ఊరట చేకూరిన విషయం విదితమే.
కొనుగోలు కేంద్రాలపై స్పష్టత ఇవ్వని సర్కారు మొక్కజొన్న పంటకు దక్కని మద్దతు ధర వాతావరణ మార్పులతో రైతుల్లో ఆందోళన రైతుల శ్రమను నిలువునా దోచేస్తున్న వ్యాపారులు
జాడలేని కొనుగోలు కేంద్రాలు
ఎప్పుడు తెరుస్తారో? ఏమో?
రూ.2 వేలకు
మించడం లేదు
నాడు రైతులకు అండగా..
ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రైతులు మద్దతు ధర కంటే తక్కువకే వ్యాపారులకు విక్రయిస్తున్నారు. రైతులు నష్టపో కుండా చూడాల్సిన కూటమి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదని రైతులు విమర్శిస్తున్నారు. దళారుల చెర నుంచి రైతులను ఒడ్డున వేసేందుకు సాగు అధికంగా ఉన్న ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి. కానీ నేటి వరకూ కొనుగోలు కేంద్రాల ఊసు లేదు. అధికారులు క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం కొనుగోలు కేంద్రాలు తెరిచే విషయమై స్పష్టత ఇవ్వటం లేదు. రైతు సంక్షేమాన్ని యోచించి వెన్నుదన్నుగా నిలవాల్సిన పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

మొక్కజొన్నకు ఆధరణ కరువు

మొక్కజొన్నకు ఆధరణ కరువు

మొక్కజొన్నకు ఆధరణ కరువు