
నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి కృష్ణాజిల్లాకు చెందిన భక్తులు రూ.లక్ష విరాళం సమర్పించారు. కంకిపాడుకు చెందిన పి.శ్రీనివాసరావు, సత్యవతి కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు శనివారం ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ.1,01,116 విరాళం అందజేసింది. ఆలయ అధికారులు దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేష వస్త్రాలను అందజేశారు.
తిరుపతమ్మ ఆలయానికి రూ.లక్ష విరాళం
పెనుగంచిప్రోలు: గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ తిరుపతమ్మవారి ఆలయానికి శనివారం కృష్ణాజిల్లా, ఉయ్యూరు మండలం, గండికుంట గ్రామానికి చెందిన కగ్గా సాంబయ్య దంపతులు రూ.లక్ష విరాళం సమర్పించారు. ఈ నగదును ఆలయ ఏఈఓ తిరుమలేశ్వరరావు చేతుల మీదుగా ఆందజేశారు. విరాళంలో రూ.50 వేలు నిత్యాన్నదాన పథకానికి, రూ.50 వేలు అంకమ్మ వారి ఉపాలయం గోపురం వెండి తాపడానికి వినియోగించాలని కోరారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు దాతలను అమ్మవారి శేష వస్త్రం, ప్రసాదాలతో సత్కరించారు.
పోలీస్ యంత్రాంగానికి
ల్యాప్‌టాప్‌లు అందజేత
విజయవాడస్పోర్ట్స్: ఎన్టీఆర్ జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బందికి 50 ల్యాప్‌టాప్‌లను డీజీపీ హరీష్‌కుమార్‌గుప్తా పంపిణీ చేశారు. ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ అయిన ‘కంట్రోల్ ఎస్ డేటా’ కంపెనీ సమకూర్చిన ఈ ల్యాప్‌టాప్‌లను డీజీపీ కార్యాలయంలో శని వారం అందజేశారు. సాంకేతిక పరిజ్ఞానంతో కేసులను త్వరితగతిన ఛేదించేందుకు ఈ పరికరాలను అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు, కంట్రోల్ ఎస్ డేటా సెంటర్ డైరెక్టర్, రిటైర్డ్ డి.జి రాజీవ్‌కుమార్‌త్రివేది, కంపెనీ ప్రతినిధులు గోపాల్‌అగర్వాల్, మనీషా, తెలంగాణ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ కౌన్సిల్ చైర్మన్ సత్యనారాయణ, డీసీపీలు కె.జి.వి.సరిత, తిరుమలేశ్వరరెడ్డి, ఎ.బి.టి.ఎస్. ఉదయరాణి, కృష్ణమూర్తినాయుడు, ఎస్.వి.డి.ప్రసాద్, ఏడీసీపీలు జి.రామకృష్ణ, ఎ.వి. ఎల్.ప్రసన్నకుమార్, ఎం.రాజారావు, కె.కోటేశ్వరరావు తదిరులు పాల్గొన్నారు.
బ్రాండ్ ఇమేజ్ టైటిల్ పోటీలకు విశేష స్పందన
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విజయవాడకు ప్రత్యేక గుర్తింపు తెచ్చేందుకు నిర్వహి స్తున్న బ్రాండ్ ఇమేజ్ టైటిల్ పోటీలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించిందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వినూత్న ఆలోచనలతో ఇప్పటి వరకు 200 మందికి పైగా తమ ఎంట్రీలను పంపారని తెలిపారు. ఔత్సాహికులకు మరో అవకాశం కల్పించాలనే ఉద్దే శంతో ఎంట్రీలు పంపేందుకు మే పదో తేదీ వరకు గడువు పొడిగించినట్లు కలెక్టర్ లక్ష్మీశ వెల్లడించారు. గడువు తేదీ ముగిసిన అనంతరం ఉత్తమ టైటిల్, ట్యాగ్‌లైన్లను ఎంపిక చేస్తామన్నారు. విజేతలకు ప్రశంసా పత్రం, బహుమతులతో పాటు సముచిత గుర్తింపు కల్పిస్తామని వివరించారు. ఈ పోటీల్లో పాల్గొని ఎంట్రీలు పంపిన ప్రతిఒక్కరికీ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ అందజేస్తామని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.

నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం

నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం