జనావాసాల్లోకి ఎలుగుబంట్లు
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కేంద్రంలోని దిగువవీధిలోకి శనివారం రాత్రి రెండు ఎలుగుబంట్లు చొరబడ్డాయి. కన్న మాడీ ఇంటి పరిసరాల్లో ఎలుగులు తిరగడాన్ని చూసిన స్థానికులు భయంతో ఇళ్ల తలుపులు వేసుకొని వెళ్లిపోయి.. జిల్లా అటవీశాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అయితే పగటిపూట ఎలుగుబంట్లు రావడం లేదు. దీంతో రాత్రివేళ మాటువేసి పట్టుకుంటామని అటవీ సిబ్బంది తెలిపారు. సమీపంలో ఉన్న కొండల పైనుంచి ఆహారం కోసం జనావాసాల్లోకి ఎలుగులు వస్తుండడంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
కలప దుంగలు స్వాధీనం
రాయగడ: జిల్లాలోని కల్యాణ సింగుపూర్ అటవీ రేంజ్ పరిధి నారింగిబడి అటవీ ప్రాంతంలో 10 విలువైన కలప దుంగలను అధికారులు శనివారం సాయంత్రం స్వాధీనం చేసుకున్నారు. ఎప్పటిలాగే ఆ ప్రాంతంలో ఏనుగుల నుంచి ప్రజలను రక్షించేందుకు పహారా కాస్తున్న సమయంలో గుర్తు తెలియని దుండగులు ముందుగా చెట్లను నరికి కలప దుంగలను ఒక మారుమూల ప్రాంతంలో దాచారు. అదే సమయంలో అటవీ రేంజర్ చందన్ గొమాంగో, ఫారెస్టర్ శివశంకర్ మహాపాత్రో, గార్డు అక్షయ కుమార్ మిశ్రో, తేజరాజ్ సున, తేజస్వీని సాహు, పారా గార్డు తదితరులకు కలప దంగలు తారసపడ్డాయి. దీంతో వాటిని స్వాధీనం చేసుకుని అటవీ శాఖ కార్యాలయానికి తరలించారు. స్వాధీనం చేసుకున్న కలప దుంగల విలువ సుమారు రూ.20 వేలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
జీవనోపాధి మిషన్ ప్రాజెక్టు సందర్శన
మల్కన్‌గిరి: కలెక్టర్ ఆశిష్ ఈశ్వర్ పటేల్ ఆదివారం మల్కన్‌గిరి సమితి గౌడిగూఢ, జయరామ్‌గూఢ పంచాయతీలోని 40 ఎకరాల్లో వేసిన జీవనోపాధి మిషన్ ప్రాజెక్ట్‌ను సందర్శించారు. ఈ ప్రాజెక్ట్‌లో గిరిజనులు పుచ్చకాయలు, చిక్కుడి, ఉల్లి, కొల్వాడ్ ఆకుకూరలు వేసి సాగు చేస్తున్నారు. కలెక్టర్ రైతులతో చర్చించి ఏడాదికి సరిపడా సేంద్రియ ఎరువులు, పురుగు మందులు అందజేయాలని మిషన్ ప్రాజెక్ట్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా సబ్ కలెక్టర్ దుర్యోధన బోయి, ప్రాజెక్ట్ మేనేజర్ విశ్వనాథ్ మిశ్రో తదితరులు పాల్గొన్నారు.
జనావాసాల్లోకి ఎలుగుబంట్లు
జనావాసాల్లోకి ఎలుగుబంట్లు
Comments
Please login to add a commentAdd a comment