విద్యార్థులకు వక్తృత్వ పోటీలు
రాయగడ: స్థానిక సాయిప్రియ నగర్‌లోని సాయిప్రియ వెల్ఫేర్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణలో నాగరికుని బాధ్యత అనే అంశంపై వక్తృత్వ పోటీలు ఆదివారం నిర్వహించారు. ఈ పోటీల్లో 15 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరిలో దక్షిత వల్లి ప్రథమ స్థానం, బబులి బిశ్వకర్మ ద్వితీయ స్థానం, నవస్మిత నాయక్ తృతీయ స్థానాన్ని కై వసం చేసుకున్నారు. క్లబ్ కార్యదర్శి దయానంద కడంగ అధ్వర్యంలో నిర్వహించిన పోటీలకు న్యాయవాది ప్రదీప్ కుమార్ దాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
● సెంచూరియన్ స్కూల్‌లో...
మార్చి 7వ తేదీన జయపురంలో జరగనున్న ప్రమేయ ప్రమేయ సన్మాన్ కార్యక్రమాన్ని పురస్కరించుకొని స్థానిక సెంచూరియన్ పబ్లిక్ స్కూల్‌లో విద్యార్థులకు వక్తృత్వ పోటీలను ఆదివారం నిర్వహించారు. సెంచురియన్ విశ్వ విద్యాలయం మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రాజేష్ పాఢి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటువంటి తరహా పోటీలు నిర్వహించడం వలన విద్యార్థుల్లో పోటీతత్వం పెరుగుతుందన్నారు. ప్రకృతి విపత్తు అనే అంశంపై నిర్వహించిన పోటీల్లో 40 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యార్థులకు వక్తృత్వ పోటీలు
Comments
Please login to add a commentAdd a comment