గిరి రైతులకు నీటి పంపులు పంపిణీ
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కేంద్రంలో సమన్విత ఆదివాసీ అభివృద్ధి సంస్థ ద్వారా ముఖ్యమంత్రి జనజాతి జీవికా మిషన్ పథకం ద్వారా జనజాతి జీవికా హితాధికారులకు నీటి పంపులను గిరి రైతులకు ఆదివారం పంపిణీ చేశారు. జిల్లా సబ్ కలెక్టర్ దుర్యోధన్ బోయి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఆశోక్ పరిడా, ఐటీడీఏ ప్రాజెక్టు డైరెక్టర్ విశ్వనాథ్‌మిశ్రో పాల్గొన్నారు. నీటి పంపుల పంపిణీకు ఒడిశా కృషి పరిశ్రమ నిగమ్, మల్కన్‌గిరి జిల్లా అధికారి శాంతను కుమార్ సామల్ సహకరించారు. వీటిన వినియోగంపై గిరిజనల రైతులకు అధికారులు అవగాహన కల్పించారు.
రక్తదాన శిబిరం
రాయగడ: స్థానిక సాయిప్రియనగర్‌లో గల ప్రభుత్వ అర్బన్ ఆస్పత్రిలో సాయిప్రియ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం రక్తదాన శిబిరం జరిగింది. కార్యక్రమానికి నాల్గో బెటాలియన్ సీఆర్‌పీఎఫ్2 కమాండెంట్ ఫిరొజ్ కుజుర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. శిబిరంలో 44 యూనిట్ల రక్తం సేకరించారు. ప్రభుత్వ ఆస్పత్రి ఏడీఎం డాక్టర్ మమత చౌదరి, డాక్టర్ గౌతం పట్నాయక్ పర్యవేక్షణలో జరిగిన శిబిరంలో క్లబ్ సభ్యులతో పాటు సీఆర్పీఎఫ్ జవాన్లు రక్తదానం చేశారు. కార్యక్రమంలో క్లబ్‌కు చెందిన డాక్టర్ సురేష్ కుమార్, దేవరాజ్ పండ తదితరులు పాల్గొన్నారు.
గిరి రైతులకు నీటి పంపులు పంపిణీ
Comments
Please login to add a commentAdd a comment