బిజూ ఆశయాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి
జయపురం: మాజీ ముఖ్యమంత్రి బిజయానంద పట్నాయక్ ఉరఫ్ బిజూ పట్నాయక్ జయంతిని జయపురం బీజేడీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. బుధవారం స్థానిక బిజూ రాజనగర్ కూడలి వద్ద బిజూ విగ్రహానికి బీజేడీ నేత, జయపురం మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ సూర్యనారాయణ రథ్ (మున్న రథ్), తదితరులు నివాళులర్పించారు. జిల్లా కేంద్ర హాస్పిటల్‌కు వెళ్లి రోగులకు పండ్లు, స్వీట్లు పంచారు. బిజూ పట్నాయక్ రాష్ట్రానికి, దేశానికి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు.
ఆవిష్కరణకు నోచుకోని విగ్రహం
బిజూ విగ్రహాన్ని జయపురం మున్సిపాలిటీ అధికారులు రెండేళ్ల క్రితం తయారుచేయించారు. నేటికీ ఆవిష్కరణకు నోచుకోలేదు. ఇది బిజూ పట్నాయక్‌ను అవమానించటమేనని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మున్సిపాలిటీ కౌన్సిల్‌లో మెజారిటీ బీజేడీకి ఉన్నా విగ్రహాన్ని పట్టణంలో ఆవిష్కరించలేదు. విగ్రహం మున్సిపాలిటీ కార్యాలయం ఆవరణలోనే ఉంది.
బిజూ ఆశయాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి
Comments
Please login to add a commentAdd a comment