అంబులెన్స్‌ను ఢీకొట్టిన గూడ్స్ రైలు
రాయగడ: చికిత్స కోసం రోగులను తీసుకెళ్తున్న అంబులెన్స్ ప్రమాదానికి గురైంది. కొరాపుట్–రాయగడ రైల్ మార్గంలో భళుమస్క, సికరపాయి రైల్వేస్టేషన్ మధ్య అంబులెన్స్‌ను కొరాపుట్ నుంచి వస్తున్న గూడ్స్ రైలు సోమవారం ఢీకొంది. అయితే గూడ్స్ డ్రైవర్ సమయస్ఫూర్తిగా వ్యవహరించి బ్రేకు వేయడంలో అంబెలెన్స్‌లోని రోగులకు ఎటువంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా బయటపడ్డారు. అయితే అంబులెన్స్ మాత్రం నుజ్జునుజ్జయ్యింది. వివరాల్లోకి వెళితే.. అనంత ఐ ఆస్పత్రికి చెందిన అంబులెన్స్ కళ్యాణసింగుపూర్ సమితి సికిరపాయి పంచాయతీలోని కానిపాయి, కంచోమోజురి, జుకుడు, బెతలొంక తదితర గ్రామాలకు చెందిన ఎనిమిది మంది రోగులను కంటి ఆపరేషన్ల కోసం సికరపాయికి అంబులెన్స్‌లో తీసుకువస్తున్న సమయంలో భళుమస్క, సికరపాయి మార్గం మధ్య లెవెల్ క్రాసింగ్ దాటుతుండగా హఠాత్తుగా గూడ్స్ రైలు ఢీకొంది. సుమారు వంద మీటర్ల వరకు ఆంబులెన్స్‌ను ఈడ్చుకుంటూ పోయింది. అయితే ఎనిమిది మంది రోగులతో పాటు డ్రైవరు, ఆశ కార్యకర్తలతో కలిసి మొత్తం పది మంది ప్రాణాలతో బయటపడగలిగారు. సమాచారం తెలుసుకున్న డీఆర్‌ఎం అమితాబ్ సింఘాల్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. భళుమస్క, సికరపాయి మధ్య ప్రజల రాకపొకలకు సంబంధించి మధ్యలో ఉన్న రైలు క్రాసింగ్‌ను దాటుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి. ఈ ప్రాంతంలో అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నిర్మించాలని ఎప్పటి నుంచో గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
సురక్షితంగా బయటపడిన రోగులు
తప్పిన పెను ప్రమాదం
అంబులెన్స్‌ను ఢీకొట్టిన గూడ్స్ రైలు
Comments
Please login to add a commentAdd a comment