● వేతనాలు పెంచాలని డిమాండ్
ఆశ కార్యకర్తల ఆందోళన
రాయగడ: ఆశ కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడంతో పాటు వేతనాలను పెంచాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ఆశ కార్యకర్తల మహాసంఘం ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా ఆశ కార్యకర్తల సంఘం సొమవారం ఆందోళన చేపట్టింది. ఆ సంఘం జిల్లా శాఖ అధ్యక్షురాలు తమలా సాహుకార్, కార్యదర్శి గీతాంజలి హియాల్ నేతృత్వంలో జరిగిన ఆందోళనలో భాగంగా స్థానిక సమితి కార్యాలయం నుంచి భారీ ర్యాలీగా వచ్చిన ఆశ కార్యకర్తలు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం డిప్యూటీ కలెక్టర్ నారాయణ మిశ్రోకు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆశ కార్యకర్తల సంక్షేమం కోసం తగురీతిలో స్పందించాలని వినతిపత్రంలొ పేర్కొన్నారు. ఆశ కార్యకర్తలకు భారతీయ మజ్దూర్ సంఘం నాయకులు జోగేశ్వర్ దాస్ తదితరులు మద్దతు ప్రకటించారు.
● వేతనాలు పెంచాలని డిమాండ్
Comments
Please login to add a commentAdd a comment