అగ్నిగంగమ్మ జాతర ప్రారంభం
రాయగడ: రాయగడకు సమీపంలోని నీలావడి అమ్మవారి వార్షిక జాతర సోమవారం నుంచి ప్రారంభమయ్యింది. ఉత్కళాంధ్రుల ఆరాధ్య దైవంగా పూజలందుకుంటున్న అమ్మవారి జాతరను వైభవంగా నిర్వహించేలా కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. సాయంత్రం సంప్రదాయ బద్ధంగా అమ్మవారి పాదాలను ఊరేగింపుగా తీసుకువచ్చి పూజా మండపంలో నిలపడం ద్వారా జాతరకు శ్రీకారం చుట్టారు. తొమ్మిది రోజులు జరగనున్న అమ్మవారి జాతరను తిలకించేందుకు ఇటు ఒడిశా అటు ఆంధ్రాకు చెందిన వేలాది మంది భక్తులు వస్తుంటారు. భక్తుల సౌకర్యార్ధం అన్ని ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. అమ్మవారి జాతర ముగింపు రోజున రెండు లక్షల మందికిపైగా భక్తులు హాజరవుతారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయడంతో పాటు తాగునీటి సౌకర్యాలను అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా క్యూలైన్‌లో నిలబడి అమ్మవారి దర్శనం కోసం ఉండే భక్తులకు ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
అగ్నిగంగమ్మ జాతర ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment