తాగునీటి ప్రాజెక్ట్ పనుల పరిశీలన
మల్కన్‌గిరి: జిల్లాలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, తాగునీటిశాఖ మంత్రి రవి నారాయణ్ నాయక్ బుధవారం పర్యటించారు. వెంకటపాలెంలోని తాగునీటి ప్రాజెక్ట్ పనులను పరిశీలించారు. తర్వగా పూర్తిచేయ్యాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. అనంతరం కలిమెల సమితిలోని ప్రాజెక్ట్ పురోగతిపై సమీక్షించారు. ఈ ప్రాజెక్ట్ కోసం రూ.37 కోట్లు వ్యయం చేయడం జరిగిందన్నారు. దీని ద్వారా ఐదు గ్రామ పంచాయతీల్లోని 5,865 ఇళ్లకు తాగునీరు సరాఫరా అవుతుందన్నారు. తొలిత జిల్లాలో జరుగుతున్న బోడ జాతర సందర్భంగా కలిమెల సమితి మాన్యంకొండ గ్రామంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కలెక్టర్ ఆశీష్ ఈశ్వర్ పటేల్, మల్కన్‌గిరి ఎమ్మెల్యే నర్సింగ్ మడ్కమి, బీజేపీ అధ్యక్షుడు ఆశోక్ పరిడా తదితరులు పాల్గొన్నారు.
తాగునీటి ప్రాజెక్ట్ పనుల పరిశీలన
Comments
Please login to add a commentAdd a comment