డీసీపీగా జగ మోహన్ మీనా బాధ్యతల స్వీకరణ
భువనేశ్వర్: భువనేశ్వర్ కొత్త డీసీపీగా జగ మోహన్ మీనా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన 2013 సంవత్సరపు ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారి. ఇప్పటివరకూ డీసీపీగా విధులు నిర్వహించిన పినాక్ మిశ్రా నుంచి జగమోహన్ మీనా బాధ్యతలు చేపట్టారు. కటక్ నగర డీసీపీగా కూడా ఈయన పని చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, నేరస్తుల కదలికలపై గట్టి నిఘా వేస్తామన్నారు. దీనికోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. సమాన్యులకు సైతం పోలీసు సేవలు అందిస్తామన్నారు. ఇందులో భాగంగా భువనేశ్వర్ ప్రజల కోసం 82803 38302 నంబర్‌ను అందుబాటులో ఉంచుతామన్నారు. ఎవరికై నా తమ సేవలు అవసరమైతే ఈ నంబర్‌ను సంప్రదించాలని, వాట్సాప్ ద్వారా కూడా సమస్యలను తెలియజేయవచ్చునన్నారు.
నాలుగు గంటలు
జగన్నాథుని దర్శనం నిలిపివేత
భువనేశ్వర్: పూరీ జగన్నాథ మందిరంలో బుధవారం సాయంత్రం మూల విరాట్టు దర్శనాన్ని నాలుగు గంటలపాటు తాత్కాలికంగా నిలిపి వేశారు. రత్న వేదికపై కొలువు దీరిన బలభద్ర స్వామి, దేవీ సుభద్ర, జగన్నాథుని మూల విరాట్టులకు శ్రీ ముఖ సింగారం సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా సాయంత్రం ఆరు నుంచి రాత్రి పది గంటల వరకు భక్తులకు స్వామి దర్శనాన్ని నిలిపి వేసినట్లు దేవస్థానం అధికార యంత్రాంగం తెలిపింది.
మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యం
● రుణ మేళాలలో ఎమ్మెల్యే రూపు బొత్ర
జయపురం: జయపురం సబ్ డివిజన్ బొరిగుమ్మ సమితి కార్యాలయ ప్రాంగణంలో మిషన్ శక్తి మేగా రుణ మేళా బుధవారం నిర్వహించారు. సమితి బీడీఓ సంధ్య సమరత్ పర్యవేక్షణలో జరిగిన మేళాకు కొట్‌పాడ్ ఎమ్మెల్యే రూపు బొత్ర ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళల ఆర్థిక ఉన్నతికి రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తుందని వెల్లడించారు. సుభద్ర పథకంలో ప్రతి మహిళకు ఏడాదికి రూ.10 వేల చొప్పున ఐదేళ్లలో రూ.50 వేలు వారి ఖాతాల్లో వేస్తుందన్నారు. మహిళలకు అందజేస్తున్న ఆర్థిక సహాయం, రుణాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. బొరిగుమ్మ సమితిలోని 110 మహిళా స్వయం సహాయక గ్రూపులకు రూ.4 కోట్ల 10 లక్షల 80 వేల చెక్‌ను అందజేశారు. నాలుగు స్వయం సహాయక గ్రూపులకు రూ.పది లక్షల చొప్పున రుణం అందజేశారు. సమితి కో ఆర్డినేటర్ దేవేంద్రకుమార్ పండా పర్యవేక్షించారు.
అడుగంటిన చెరువు!
పర్లాకిమిడి: పట్టణంలో బలుంకేశ్వర ఆలయం వద్ద వున్న పుష్కరిణి కాలక్రమేణా ఏపుగా గడ్డి, పిచ్చి మొక్కలుపెరిగి ఎండిపోయింది. పట్నాయక్ చెరువుగా పిలువబడే ఈ పుష్కరిణిలో ఒకప్పుడు చాలామందికి వేసవిలో స్నానాలు ఆచరించడం, చేపల చెరువుగా పేరుగాంచింది. పచ్చకామర్లు వ్యాధిగ్రస్తులు ఈ పుష్కరిణిలో స్నాణం చేస్తే అనారోగ్యం నుంచి విముక్తి అవుతారన్న నమ్మకం వుండేది. కాలక్రమేణ ఈ పుష్కరిణి ఆక్రమణలకు గురుకావడం, పునరుద్ధరణ పనులు చేపట్టకపోవడంతో కుసించుకుపోయింది. చెరువు పుణరుద్ధరణకు పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి స్థానికులతో చర్చించి తగు చర్యలు చేపడతామని అన్నారు.
డీసీపీగా జగ మోహన్ మీనా బాధ్యతల స్వీకరణ
Comments
Please login to add a commentAdd a comment