‘సుభద్ర’తో మహిళాభ్యున్నతి
భువనేశ్వర్: రాష్ట్ర ప్రభుత్వం సుభద్ర యోజన పట్ల అవగాహన పెంపొందించేందుకు నడుం బిగించింది. ఈ పథకంపై మహిళలకు విస్తృత అవగాహన కల్పించేందుకు బుధవారం రాజధాని నగరం భువనేశ్వర్ నుంచి ర్యాలీ ప్రారంభించింది. అర్హులైన ప్రతి ఒక్కరూ లబ్ధిదారులుగా చేరాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది. సుభద్ర యోజన శ్రేయస్సు ఫలాలు ప్రతి మహిళ అందుకోవాలనే సందేశంతో నగరం వ్యాప్తంగా బీదల ప్రభావిత ప్రాంతాల్లో సుభద్ర ఊరేగింపు నిర్వహించారు. స్థానిక ఖండగిరి కూడలి నుంచి ప్రారంభమై జొగొమొరా వీధి వరకు ఈ కార్యక్రమం కొనసాగింది. కార్యక్రమంలో ఏకామ్ర నియోజకవర్గ ఎమ్మెల్యే బాబు సింగ్, నగర మేయర్ సులోచన దాస్, కమిషనర్ రాజేష్ ప్రభాకర్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప్రభాతి పరిడా మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి పథకం వర్తింపజేస్తామని చెప్పారు. దరఖాస్తు గడువు ఈ నెలాఖరుతో ముగియనున్నందున అర్హులంతా చేరాలని కోరారు. ఈ నేపథ్యంలోనే ఇంటింటా సర్వే చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న 1.8 కోట్ల మంది మహిళల్లో 1.20 కోట్ల మంది మహిళలకు తొలి విడత కింద ఐదో దశ పంపిణీ గురువారం జరుగుతుందని తెలిపారు.
‘సుభద్ర’తో మహిళాభ్యున్నతి
Comments
Please login to add a commentAdd a comment