ఆశ్రమ పాఠశాల ఘటనపై విచారణ చేయాలి
● కాంగ్రెస్ నాయకుల డిమాండ్
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ సమితి దీసారీగూడ ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని గర్భం దాల్చి.. గత నెల 24వ తేదీన బిడ్డకు జన్మనిచ్చిన ఘటనపై ఉన్నతస్థాయి విచారణ చేపట్టాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక డీసీసీ కార్యాలయంలో బుధవారం విచారణ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ముదుంగా విద్యార్థిని చదివిన పాఠశాలను సందర్శించి ప్రధానోపాధ్యాయుడుతో మాట్లాడారు. అలాగే వసతి గృహంలో బాలికల ఆరోగ్య సేవకురాలతో చర్చించారు. అనంతరం బాలిక స్వగ్రామానికి వెళ్లి తల్దిదండ్రులతో చర్చించారు. ఆశ్రమ పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థిని తల్లి అయిందని ఆరోపించారు. జిల్లా కలెక్టర్ ఆశీష్ ఈశ్వర్ కూడా కలిసి సంఘటనపై విచారణ వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ స్పందిస్తూ.. విచారణ చేస్తామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విచారణ కమిటీలో చిత్రకొండ ఎమ్మెల్యే మంగు ఖీలో, మాజీ మంత్రి నాగేంద్రప్రసాద్, గుణుపురం ఎమ్మెల్యే సత్యజిత్ గమాంగో, నాయ్యవాది మానస్ మల్లిక్, పాలిపిక మాఝి, నవరంగ్‌పూర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి భుజబల్ మాఝి, మల్కన్‌గిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గోవిందపాత్రో తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment