సాంకేతిక అంశాలపై పట్టు అవసరం
ఎచ్చెర్ల క్యాంపస్: విద్యార్థుల్లో సాంకేతిక అంశాలపై పట్టు అవసరమని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వ విద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఎం.విజయ్‌కుమార్ అన్నారు. శ్రీకాకుళం ఆర్‌జీయూకేటీ క్యాంపస్ (ఎస్‌ఎంపురం)లో మూడు రోజుల పాటు నిర్వహించనున్న టెక్నికల్ ఫెస్ట్ టెక్నివేర్‌ను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజ్ఞానం, వినోదం, సాంకేతిక అంశాల అవగాహన ఆధారంగా కార్యక్రమం జరుగుతుందని, 600 కళాశాలలను ఆహ్వానించామని చెప్పారు. ఐఐటీ, ఎన్‌ఐటీ ప్రొఫెసర్లు, సాంకేతిక నిపుణులను రిసోర్సుపర్సన్లుగా ఆహ్వానించినట్లు తెలిపారు. ప్లేస్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టిపెట్టినట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment