రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా మల్కన్‌గిరి సమితి చందన్‌గూడ గ్రామం వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందాడు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. పదో తరగతి పరీక్షల చివరి రోజు కావడంతో విక్రమ్ సర్దార్(15) మరో విద్యార్థితో కలిసి బయల్దేరాడు. ఈ బాలుడు మల్కన్‌గిరి సమితి పద్మాగిరి పంచాయతీలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నాడు. వీరికి సీరాపల్లి పాఠశాలలో సెంటర్ పడింది. దీంతోబైక్‌పై వెళ్తుండగా పికప్ వ్యాన్ ఢీకొట్టడంతో తలకు బలంగా గాయమైంది. అక్కడే స్పృహ కోల్పోయాడు. స్థానికులు వెంటనే మల్కన్‌గిరి ఆస్పత్రికి తరలించగా విక్రమ్ చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మల్కన్‌గిరి ఐఐసీ రీగాన్‌కీండో ఆస్పత్రికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం తర్వాత తల్లిదండ్రులకు అప్పగించారు.
రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి
రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి
Comments
Please login to add a commentAdd a comment