భువనేశ్వర్: స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం (బీపీఐఏ) నుంచి ఘజియాబాద్ మరియు పోర్ట్ బ్లెయిర్ ప్రాంతాలకు ప్రత్యక్ష విమానయాన సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఈనెల 30వ తేదీ నుంచి ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. భారత ప్రభుత్వ కొత్త గమ్యస్థాన విధానం ప్రకారం ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ నిత్యం ఈ సేవలను నిర్వహిస్తుందని తెలిపారు. రాజధాని నగరం భువనేశ్వర్ నుంచి మరో రెండు నగరాలకు కొత్తగా ప్రత్యక్ష విమానయాన అనుసంధానంపై సీఎం మోహన్‌చరణ్ మాఝీ హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment