పర్లాకిమిడి: స్థానిక సరస్వతీ శిశు విద్యామందిర్‌లో అదివారం అఖిలభారత సాహిత్యపరిషత్ గజపతి జిల్లా ఆధ్వర్యంలో మహేంద్రతనయ సాహిత్య సంసద్, సరస్వతీ శిశు విద్యామందిర్ ఆధ్వర్యంలో నూతన సంవంత్సరం ఉగాది వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యఅతిథిగా గంజాం జిల్లా ఆర్‌ఎస్‌ఎస్ సంఘ్ చాలక్ డాక్టర్ భగవాన్ త్రిపాఠి పాల్గొని మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో సంఘ్ పరివార్ కలిసి భారతదేశాన్ని పటిష్టపరిచి శక్తివంతంగా యువత చేయాలని పిలుపు నిచ్చారు. ప్రొఫెసర్ కళ్యాణీ మిశ్రా సహకారంతో వేడుకలు జరుపగా, గౌరవ అతిధులుగా చంద్రశేఖర పట్నాయక్, ఆచార్య సరోజ్ పండా పాల్గొన్నారు. విద్యార్థినులు ఆయుషీ అస్మితా, మరియు బేబి బిశ్వాల్ ఉగాది ప్రాధాన్యతను వివరించారు.
అలరించిన గాన కచేరి
పర్లాకిమిడి: సినీ గాయకులు, రాష్ట్ర జయదేవ్ సమ్మాన్ పురస్కార గ్రహీత స్వర్గీయ రఘునాథ పాణిగ్రాహి స్మృతి చరణ ఉత్సవాన్ని స్థానిక టౌను హాలులో శనివారం రాత్రి ఒడిశా సంగీత నాటక అకాడమి, భక్తి నైవేద్య సంస్కృతి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా తెలుగులో చల్లని రాజా.. ఓ చందమామా..అనే పాటను ఇలవేల్పు సినిమాలో.. పి.సుశీల, పి.లీలతో కలిసి రఘునాథ పాణిగ్రాహి పాడగా సుసర్ల దక్షిణామూర్తి సంగీతం అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బిజయకుమార్ దాస్, శ్రీక్రిష్ణచంద్రగజపతి కళాశాల ప్రిన్సిపాల్ జితేంద్రనాథ్ పట్నాయక్, దూరదర్శన్ గాయకులు రఘునాథ పాత్రో, డాక్టర్ చందన్ పట్నాయక్, జిల్లా సాంస్కృతిక అధికారి అర్చనా మంగరాజ్‌లు హాజరయ్యారు. 1932 ఆగస్టు 10న రాయగడ సమితి గుణుపురంలో జన్మించిన గాయకులు రఘునాథ పాణిగ్రాహి 2013 ఆగస్టు 25న మృతి చెందారు. ఒడియా, తెలుగు, తమిళంలో అనేక పాటలు పాడిన రఘునాథ పాణిగ్రాహి స్మృతి చిహ్నంగా గానకచేరి ఏర్పాటు చేశారు. ఆకాశవాణి కళాకారులు డాక్టర్ చందన్ గంతాయత్ నేతృత్వంలో అశుతోష్ మిశ్రా, అమృత పురోహిత్, బిరాజినీ శోబోరో, స్పందనా పండా, గోపాలకృష్ణ నాహక్ తదితరులు రఘునాథ పాణిగ్రాహి పాడిన పాటలను వినిపించారు.
పారదర్శకంగా
విచారణ చేపట్టాలి
శ్రీకాకుళం కల్చరల్: డాక్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై పారదర్శకంగా విచారణ చేపట్టాలని జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్, జిల్లా క్రైస్తవ సంక్షేమ సంఘం సభ్యులు కోరారు. ఈ మేరకు నగరంలోని గర్‌ల్స్ హైస్కూల్ ఎదురుగా ఉన్న క్రిస్టియన్ వర్షిప్ సెంటర్ నుంచి కొన్నావీధిలో ఉన్న కీస్టోన్ చర్చి వరకు శాంతియుత ర్యాలీ ఆదివారం చేపట్టారు. అనంతరం సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ప్రవీణ్ ప్రగడాలది ప్రమాదం కాదని, ఎవరో హత్య చేశారని అనుమానం వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ చైర్మన్ డీఎస్‌వీఎస్ కుమార్, ఎస్‌ఎంయూపీఎఫ్ ప్రెసిడెంట్ రెవ.జాన్ జీవన్, సెక్రటరీ సీహెచ్ ప్రేమన్న, బిషప్ సామ్యూల్ మొజెస్, రెవ.పి.ఎస్.స్వామి, బిషప్ బి.బర్నబస్ తదితరులు పాల్గొన్నారు.
శిశు విద్యామందిర్‌లో ఉగాది వేడుకలు