
పూరీ రథయాత్రకు మరో గుర్తింపు
భువనేశ్వర్: విశ్వ విఖ్యాత పూరీ శ్రీ జగన్నాథుని వార్షిక రథ యాత్ర జాతీయ ప్రతిష్టాత్మక సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నేషనల్ ఇన్వెంటరీ ఆఫ్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో స్థానం దక్కించుకుంది. శ్రీ మందిరం ప్రధాన పాలన అధికారి సీఏఓ డాక్టర అరవింద కుమార్ పాఢి ఈ విషయం తెలియజేశారు. భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ అధీనంలో భారత దేశ అత్యున్నత సాంస్కృతిక సంస్థ సంగీత నాటక అకాడమీ పూరీ శ్రీ జగన్నాథుని రథ యాత్ర, బాలి జాతరలను నేషనల్ ఇన్వెంటరీ ఆఫ్ ఇంటాంగిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో చేర్చిందని తెలిపారు. శ్రీ జగన్నాథుని వార్షిక రథ యాత్రకు యునెస్కో అవ్యక్త సాంస్కృతిక వారసత్వ గుర్తింపు కోసం శ్రీ మందిరం పాలక మండలి చురుగ్గా సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల కేంద్ర సాంస్కృతిక శాఖకు నామినేషన్ దస్తావేజుల్ని దాఖలు చేసినట్లు శ్రీ మందిరం సీఏఓ పేర్కొన్నారు.
చలువ పందిళ్లు ఏర్పాటు
భువనేశ్వర్: వేసవి తాపం నుంచి వాహన చోదకులకు ఉపశమనం కల్పించేందుకు నగర పాలక సంస్థ బీఎంసీ నడుం బిగించింది. పగటి పూట ఎండ సమయంలో రద్దీ నియంత్రణలో భాగంగా ట్రాఫిక్ కూడలి ప్రాంతాల్లో నిలకడగా కాసేపు ఆగాల్సి వస్తుంది. ఈ సమయంలో వాహన చోదకులకు ఎండ వేడిమి నుంచి ఉపశమన కల్పించేందుకు ప్రధాన ట్రాఫిక్ కూడలి ప్రాంగణాల్లో బీఎంసీ చలువ పందిళ్లు ఏర్పాటు చేసి నగరవాసుల మన్ననలు పొందింది.
విరజామాత పీఠంలోకి
విదేశీయుల ప్రవేశం!
భువనేశ్వర్: అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా పేరొందిన జాజ్‌పూర్ విరజా మాత పీఠం అత్యంత పవిత్రమైనది. శక్తివంతమైనది. ఈ ప్రాంగణం లోనికి విదేశీయలు విచ్చల విడిగా ప్రవేశించారు. దీంతో సాధారణ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది మహిళలతో సుమారు 10 మంది విదేశీయులు ఆలయ సముదాయంలోనికి మంగళవారం బలవంతంగా ప్రవేశించినట్లు సమాచారం. వీరంతా ఆలయ ప్రాంగణంలో స్వేచ్ఛగా తిరుగాడుతు తారసపడ్డారు. ఈ సంఘటన స్థానిక భక్తులలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. విదేశీ పర్యాటకులు ఆలయ ప్రాంగణం లోనికి ప్రవేశించడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వీరిని పంపించే ప్రయత్నంలో స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. ఆలయ సముదాయంలోనికి విదేశీయులు ప్రవేశించకుండా ఆలయ పూజారులు అడ్డుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి
రాయగడ: రోడ్డు ప్రమాదంలొ 14 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన జిల్లాలోని కళ్యాణ సింగుపూర్ సమితి పూజారిగుడ పంచాయతీ పరిధి రవుతోపొరిటిగుడ కూడలి వద్ద మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సుమన్ క్రడక మృతి చెందినట్టు పోలీసులు వెల్లడించారు. పోలీసులు, స్థానికులు తెలియజేసిన వివరాల ప్రకారం.. ద్విచక్ర వాహనంతో సుమన్ అతని స్నేహితుడు కలిసి పొరిటిగుడ గ్రామం నుంచి వెళ్తుండగా రవుతోపొరిటిగుడ కూడలి వద్ద వెనుక నుంచి వచ్చిన ప్రైవేట్ బస్సు ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో వాహనాన్ని నడుపుతున్న సుమన్ బస్సు కిందపడిపోవడంతో అక్కడే ప్రాణాలు కోల్పోగా.. అతని స్నేహితుడు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు.మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నపో లీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్నన్నారు. కొడుకుని కోల్పోయిన కన్నవారు కన్నీరుమున్నీరుగా రోదించారు. బస్సు యజమాని నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.

పూరీ రథయాత్రకు మరో గుర్తింపు

పూరీ రథయాత్రకు మరో గుర్తింపు