అద్దంకి: రాష్ట్రస్థాయి సైన్స్ ప్రదర్శనకు మండంలోని తిమ్మాయపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థుల ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. 9వ తరగతి విద్యార్థి షేక్ మహ్మద్ అబ్దుల్ ఖుర్షిద్ అఫ్జల్ ప్రదర్శించిన ప్రాజెక్టు ఎంపికై నట్లు హెచ్‌ఎం కేవీ శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. మండల స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచి, 24న బాపట్లలో నిర్వహించిన జిల్లాస్థాయి ప్రదర్శనలో ద్వితీయ స్థానం పొందిన విద్యార్థి ప్రాజెక్టు ‘ఎకో ఫ్రెండ్లీ పియాజో ఎలక్ట్రిసిటీ’ ఎంపికై నట్లు తెలిపారు. విద్యార్థికి గైడ్‌గా ఫిజిక్స్ ఉపాధ్యాయుడు ఎస్ జే శ్రీనివాసరావు వ్యవహరించారు. మరో విద్యార్థి ఎస్వీ పార్థసాయి తయారుచేసిన ‘మదర్స్ స్మార్ట్ అండ్ హెల్దీ కిచెన్’ ప్రాజెక్టు జిల్లాలో ద్వితీయ స్థానం పొంది రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు ఎంపికై ందని తెలిపారు. ఉపాధ్యాయుడు శ్రీనివాసరావును అభినందించారు.
Published Sat, Feb 25 2023 9:00 AM | Last Updated on Mon, Feb 27 2023 5:36 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment