ఖరీఫ్ ప్రణాళికను సిద్ధం చేయాలి
నరసరావుపేట రూరల్: వ్యవసాయ అనుబంద శాఖల సమన్వయంతో ప్రకృతి వ్యవసాయ కార్యకర్తలు ఖరీఫ్ ప్రణాళికను సిద్ధం చేయాలని ప్రకృతి వ్యవసాయ డీపీఎం కె.అమలకుమారి సూచించారు. ప్రకృతి వ్యవసాయ 2025 ఖరీఫ్ ప్రణాళికపై క్రోసూరు, వినుకొండ, మాచర్ల డివిజన్‌లోని సిబ్బందికి గురువారం శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. డీపీఎం అమలకుమారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర కార్యాలయ ఏఓ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమలకుమారి మాట్లాడుతూ వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలు నిర్వహించడం వలన రైతులు త్వరితగతిన అభివృద్ధి చెందుతారని తెలిపారు. ప్రణాళిక తయారిలో సామాజిక, ఆర్థిక, భౌతిక వనరులతో పాటు అన్నిరకాల అంశాలను సమగ్రరూపంలో నమోదు చేయాలని సూచించారు. వ్యవసాయ, డీఆర్‌డీఏ, ఉపాధి హామీ, సెరికల్చర్, హార్టికల్చర్ శాఖల సమన్వయంతో ప్రణాళిక తయారు చేసుకోవలని తెలిపారు. ఏఓ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ విధానాలైన తొమ్మిది సార్వత్రిక సూత్రాలను, వాటి లాభాలను రైతులకు తెలియజేయాలని తెలిపారు. అడిషనల్ డీపీఎం ప్రేమ్‌రాజు, జిల్లా శిక్షకుడు టి.సైదయ్య, ఎన్‌ఎఫ్‌ఏలు నందకుమార్, సౌజన్య, అప్పలరాజు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment