శ్రీనివాస కల్యాణం వైభవంగా నిర్వహిస్తాం
తాడికొండ: గుంటూరు జిల్లా వెంకటపాలెం గ్రామంలోని శ్రీ వేంటేశ్వరస్వామివారి ఆలయ ప్రాంగణంలో ఈనెల 15న సాయంత్రం 6:30 నుంచి 8:30 గంటల వరకు శ్రీనివాస కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు చెప్పారు. వెంకటపాలెంలోని శ్రీవారి ఆలయ ప్రాంగణంలో టీటీడీ చైర్మన్ ఈవో జె.శ్యామలరావుతో కలిసిఆయన మీడియా సమావేశం నిర్వహించారు. చైర్మన్ మాట్లాడుతూ, అమరావతి పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు మాట్లాడుతూ శ్రీనివాస కల్యాణానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకొని విస్తృత ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. సమావేశంలో టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, పనబాకలక్ష్మీ, ఎం.శాంతారామ్, ఎం.ఎస్.రాజు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవో వీరబ్రహ్మం, సీఈ సత్యనారాయణ, సీపీఆర్‌ఓ డాక్టర్ టి.రవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు
Comments
Please login to add a commentAdd a comment