వైఎస్సార్ సీపీ రాష్ట్ర విభాగంలో జిల్లాకు చోటు
డాక్టర్స్ వింగ్ అఫీషియల్ స్పోక్ పర్సన్‌గా చింతలపూడి అశోక్‌కుమార్
నరసరావుపేట: వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పల్నాడు జిల్లాకు చెందిన పలువురు పార్టీ నాయకులకు రాష్ట్ర అనుబంధ విభాగాల కమిటీలలో స్థానం కల్పిస్తూ కేంద్ర పార్టీ కార్యాలయం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. వెన్నా రాజశేఖరరెడ్డిని రాష్ట్ర సోషల్ మీడియా వింగ్ సంయుక్త కార్యదర్శిగా, డాక్టర్ చింతలపూడి అశోక్‌కుమార్‌ను రాష్ట్ర డాక్టర్ల వింగ్ అఫీషియల్ స్పోక్ పర్సన్‌గా నియమించారు.
గొలుసు లాక్కొని
యువకుల పరారీ
నరసరావుపేట టౌన్: ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు యువకులు వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు లాక్కొని వెళ్లిన సంఘటన శుక్రవారం పట్టణంలో చోటు చేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాష్‌నగర్ 60 అడుగుల రోడ్డు సీబీఐటీ స్కూల్ సమీపంలో నలిశెట్టి సులోచన నడిచి వెళ్తుండగా స్కూటీపై వచ్చిన ఇద్దరు యువకులు ఆమె మెడలో బంగారు గొలుసును లాక్కొని పరారయ్యారు. ఆమె కేకలు వేయడంతో అప్రమత్తమైన స్థానికులు వెంబడించినా ఫలితం దక్కలేదు. ఈ మేరకు బాధితురాలిచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కిశోర్ తెలిపారు.
బీజేపీ నాయకుడిపై పలువురి దాడి
రేపల్లె రూరల్: పాత కక్షల నేపథ్యంలో వ్యక్తిపై దాడిచేసి తీవ్రంగా గాయపర్చిన సంఘటన నగరం మండలం బోరమాదిగపల్లిలో చోటుచేసుకుంది. బోరమాదిగపల్లి గ్రామానికి చెందిన బీజేపీ నగరం మండల అధ్యక్షుడు జుజ్జువరపు సురేష్‌కు అదే గ్రామానికి చందిన చందోలు వీరయ్యతో కొంత కాలంగా మనస్పర్ధలు ఉన్నాయి. వీరయ్య మరి కొంతమంది గురువారం రాత్రి గ్రామ సమీపంలో కాపుకాసి ఇంటికి వెళ్తున్న సురే ష్‌పై దాడికి పాల్పడ్డారు. గమనించిన స్థానికులు కేకలు వేయడంతో వీరయ్యతోపాటు దాడికి ఉపక్రమించిన వారు పారిపోయారు. సురేష్‌ను వైద్య చికిత్సల కోసం రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వీరయ్యతోపాటు దాడికి పాల్పడిన వారు మంకీ క్యాప్ ధరించి ఉన్నారని బాధితుడు పేర్కొన్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నగరం ఎస్‌ఐ భార్గవ్ తెలిపారు. సురేష్‌పై దాడి సంఘటన తెలుసుకున్న బీజేపీ నాయకులు బేతపూడి వెంకటేశ్వరరావు, పిన్ని సాంబశివరావులు పరామర్శించారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
వైఎస్సార్ సీపీ రాష్ట్ర విభాగంలో జిల్లాకు చోటు
Comments
Please login to add a commentAdd a comment