● కంది పంటను అమ్ముకోవడానికి ఇబ్బందిపడుతున్న రైతులు ● జి
సాక్షి, నరసరావుపేట: కంది కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులు పండించిన పంటను కొంటామని కూటమి ప్రభుత్వం చెప్పిన మాటలన్నీ వట్టి మూటలుగానే మారాయి. మార్క్‌ఫెడ్, నాఫెడ్‌ల ద్వారా ఏర్పాటు చేసిన కోనుగోలు కేంద్రాలలో తూతూమంత్రంగా కందులను కొనుగోలు చేసి చేతులు దులుపుకొంటున్నారు. రకరకాల కారణాలు చెప్పి రైతుల నుంచి కంది కొనుగోలుకు నిబంధనల బంధనాలు వేస్తున్నారు. దీంతో కందిపంట సాగు చేసిన రైతన్న పరిస్థితి దయనీయంగా ఉంది. పండిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేయక ఒకవైపు.. కంది మిల్లుల యజమానులు సిండికేట్‌గా మారి దోచుకోవడంతో మరోవైపు కందిరైతు విలవిలలాడుతున్నాడు.
తేమ శాతం పేరుతో...
మద్దతు ధర రూ.7,550కు ప్రతి రైతు నుంచి సమీపంలో ఏర్పాటు చేసిన మార్క్‌ఫెడ్, నాఫెడ్‌ల ద్వారా కొనుగోలు చేస్తామని ప్రభుత్వం, అధికారులు ప్రకటనలు చేశారు. ఇప్పటివరకు సుమారు 1200 మంది రైతుల నుంచి 12,200 మెట్రిక్ టన్నుల కందులను కొనుగోలు చేసినట్టు జిల్లా మార్క్‌ఫెడ్ అధికారులు చెబుతున్నారు. అయితే ఖరీఫ్‌తో పాటు రబీ కంది కూడా అందుబాటులోకి రావడంతో ప్రభుత్వం కొనుగోలు చేసిన కంది చాలా తక్కువ. మరోవైపు తేమశాతం, తాలు పేరిట రైతుల నుంచి కందుల కొనుగోలులో మార్క్‌ఫెడ్ ప్రతిబంధకాలు సృష్టిస్తోంది. కల్లాల వద్ద రైతులు శ్రమ పడి అధికారులు చెప్పిన విధంగా తయారు చేసినా.. కొనుగోలు జరగని దుస్థితి నెలకొంది. అధికారులు చెబుతున్న ప్రకారం చేయడం వల్ల తమకు క్వింటాకు 5 నుంచి 10 కిలోల తరుగుదల కనిపిస్తోందని, ఇప్పటికే మద్దతు ధరలేక ఇబ్బందిపడుతుంటే ఇది మరింత నష్టం కలిగిస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ఆసరాగా తీసుకున్న కందుల మిల్లుల యజమానులు, వ్యాపారులు సిండికేట్‌గా మారి దోచుకుంటున్నారని రైతులు వాపోతున్నారు. ధరలు పతనమయ్యాయన్న పేరుతో క్వింటా కందులను రూ.6,000–రూ.6,200 మధ్య మాత్రమే కొంటున్నారు.
వైఎస్సార్ సీపీ హయాంలో రూ.12 వేల వరకు...
పెట్టుబడి కూడా
కష్టం
తేమ శాతం సాకుతో కొనడం
లేదు
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం హయాంలో క్వింటా కందులు రూ.10వేలకు పైగా ధర పలికింది. కొంతమంది రైతులు రూ.12 వేలకు సైతం అమ్ముకున్నారు. దీంతో ఈ ఏడాది పల్నాడులోని మెట్ట ప్రాంతాల్లో కంది పంట సాగుకు రైతులు ఉత్సాహం చూపారు. అయితే కూటమి ప్రభుత్వం ఈ ఏడాది రూ.7,550 మాత్రమే మద్దతు ధర ప్రకటించింది. తీవ్ర వాతావరణ అనుకూలతలు, చీడపీడల మధ్య పండిన అరకొర పంటను ఆ ధరకై నా అమ్ముకుందామన్న రైతులకు తీవ్ర నిరాఽశే ఎదురవుతోంది. కూటమి ప్రభుత్వం ఇప్పటికే రైతులకు ఇవ్వాల్సిన అన్నదాత సుఖీభవ లాంటి పథకాల ద్వారా ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలు ఇవ్వకపోగా కనీసం పండినపంటను సైతం అమ్ముకోలేని దుస్థితికి తెచ్చారని వాపోతున్నారు. గత ప్రభుత్వంలో ఆర్‌బీకేల ద్వారా రైతులకు అందాల్సిన సాయం సక్రమంగా అందడంతోపాటు దిగుబడులను దళారుల దోపిడీ లేకుండా అమ్ముకున్నామని వారు చెబుతున్నారు.
వారు చెప్పిందే ధర..!
వ్యవసాయశాఖ లెక్కల ప్రకారం జిల్లాలో 26,908 హెక్టార్లలో కంది పంట సాగుచేయగా సుమారు 50,879 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే దిగుబడి ఊహించిన దానికన్నా అధికంగా ఉంది. రైతులకు ఈ–క్రాప్ బుకింగ్‌పై అవగాహన కల్పించడంలో ప్రభుత్వం విఫలమవ్వడంతో కంది సాగు తక్కువగా ఉంది. మరోవైపు ఈ–క్రాప్ చేయని రైతుల నుంచి కందులు కొనుగోలు చేయబోమని కొనుగోలు కేంద్రాలు తేల్చిచెబుతున్నాయి. దీంతో తప్పనసరి ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. దీంతో వారు చెప్పిందే ధరగా మారింది.
నాలుగు ఎకరాల్లో కంది సాగుచేస్తే దిగుబడి సుమారు 25 క్వింటాళ్లు వచ్చింది. కోతల తరువాత నాలుగు రోజులు కల్లంలో ఎండబెట్టాను. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో తేమ, తాలు పేరుతో సాకులు చెబుతున్నారని జల్లెడ సైతం పట్టి సిద్ధంగా ఉన్నాం. పంట అమ్ముకుందామంటే కొనేవారు ముందుకు రావడం లేదు. ఈ సంవత్సరం దిగుబడి కూడా బాగా తగ్గింది. గత సంవత్సరం క్వింటా కంది రూ.10 వేలకు పైగా ధర పలకడంతో ఎన్నో ఆశలతో ఈ సంవత్సరం నాలుగు ఎకరాల్లో సాగు చేశాను. ఇప్పటికై నా ప్రభుత్వం మద్దతు ధర రూ.7,550లకు కంది కొనుగోలుకు చర్యలు తీసుకోవాలి.
– మిరియాల కొండలు,
కంది రైతు, ఒప్పిచర్ల, కారంపూడి మండలం
ప్రభుత్వం కంది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి కొనుగోలు చేయకపోవడంతో ఖరీఫ్‌లో పండిన కందిని క్వింటాలు రూ.6వేలకు ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం రబీ సీజన్లో కంది పంట చేతికి వస్తున్నా ప్రభుత్వం కేంద్రాల ద్వారా కొనుగోలు చేయకపోవడంతో ఇళ్లలోనే నిల్వ చేసుకుంటున్నాం. కందులు కొనుగోలు చేయాలని స్థానిక వ్యవసాయ సిబ్బందిని అడిగితే తేమశాతం ఎక్కువగా ఉందని, రకరకాల కారణాలు చెప్పి కొనుగోలు చేయడం లేదు. ఇటువంటి దుస్థితి ఎప్పుడు లేదు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నేరుగా కల్లం వద్దకు వచ్చి రూ.10వేలు పైగా చెల్లించి అధికారులు కొనుగోలు చేశారు. అప్పుడు లేని సాకులు ఈరోజు చెప్పడం ఏంటో అర్థం కావడం లేదు. మద్దతు ధర రూ.7,550లకు కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి.
– అడపాల అంబారావు,
కంది రైతు, ఆత్మకూరు గ్రామం, దుర్గి మండలం
● కంది పంటను అమ్ముకోవడానికి ఇబ్బందిపడుతున్న రైతులు ● జి
● కంది పంటను అమ్ముకోవడానికి ఇబ్బందిపడుతున్న రైతులు ● జి
Comments
Please login to add a commentAdd a comment