గణనీయంగా పెరిగిన మల్లేశ్వరుడి ఆదాయం
109 రోజుల హుండీ కానుకల ఆదాయం రూ.58.03లక్షలు
పెదకాకాని: శివాలయం మల్లేశ్వరస్వామి ఆదాయం గణనీయంగా పెరిగినట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ గోగినేని లీలాకుమార్ తెలిపారు. పెదకాకాని భ్రమరాంబ మల్లేశ్వరస్వామి వారి దేవస్థానంలో మంగళవారం హుండీల్లోని కానుకలు లెక్కించారు. పర్యవేక్షణాధికారిగా కాజ గ్రూపు టెంపుల్స్ ఈఓ పుణ్యాల వెంకటరెడ్డి హాజరయ్యారు. 109 రోజులకు హుండీ కానుకల ద్వారా రూ.58,03,497లు ఆదాయం లభించినట్లు తెలిపారు. అలాగే అన్నప్రసాద వితరణ హుండీ ద్వారా రూ.2,89,270లు సమకూరిందన్నారు. హుండీల ద్వారా బంగారం 54.300 గ్రాములు, వెండి 438 గ్రాములు, ఆస్ట్రేలియా 20 డాలర్లు, యుఎస్‌ఏ 139 డాలర్లు, ఇంగ్లాండ్ 10 పాండ్లు, నేపాల్ కరెన్సీ రూ.130 , ఇండోనేషియా రూ.5000 వచ్చాయని డీసీ తెలిపారు.
సుబ్రహ్మణ్యేశ్వరునికి విశేష పూజలు
అమరావతి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అమరావతి అమరేశ్వరాలయంలో మంగళవారం సుబ్రహ్మణ్యస్వామికి విశేషపూజలు నిర్వహించారు. స్వామివారికి భక్తుల సమక్షంలో అర్చకుడు శంకరమంచి రాజేష్ శర్మ మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం సుబ్రహ్మణ్వేశ్వరునికి విశేషాలంకారం చేసి భక్తులకు దర్శనం కల్పించి తీర్ధప్రసాదాలు అందజేశారు. అనంతరం అమరేశ్వరుని దర్శించుకుని పూజలు నిర్వహించారు. పలుగ్రామాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
శాంతి భద్రతల సమావేశానికి కలెక్టర్, ఎస్పీ హాజరు
నరసరావుపేట: రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం నిర్వహించిన శాంతిభద్రతల సమావేశానికి జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు, ఎస్పీ కంచి శ్రీనివాసరావులు హాజరయ్యారు. పలు అంశాలపై సమావేశంలో చర్చించారు.
ముగ్గురు వీఆర్‌ఓలకు షోకాజ్ నోటీసులు
మాచవరం: మాచవరం మండలంలో ముగ్గురు వీఆర్‌ఓలకు ఆర్డీఓ మురళీ కృష్ణ షోకాజ్ నోటీసులను జారీ చేసినట్లు తహసీల్దార్ ఎన్.నాగమల్లేశ్వరరావు మంగళవారం తెలిపారు. మల్లవోలు, పిల్లుట్ల, తురకపాలెం వీఆర్‌ఓలు ఏసుపాదం, లోకేష్, జానీబాషాలు ఐవీఆర్ కాల్స్‌లో పట్టాదారు పాస్ పుస్తకాల జారీ విషయంలో తమ వద్ద నుంచి డబ్బులు వసూలు చేశారని మూడు గ్రామాలకు చెందిన కొంత మంది రైతులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన నేపధ్యంలో ముగ్గురు వీఆర్‌ఓలకు షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు.
ప్రాంతీయ వ్యవసాయ ప్రదర్శన వాయిదా
గుంటూరు రూరల్: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మార్చి 27 నుంచి 29వ తేదీవరకు మూడు రోజులపాటు నిర్వహించనున్న ప్రాంతీయ వ్యవసాయ ప్రదర్శనను కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేయటం జరిగిందని విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ ఆర్.శారదజయలక్ష్మిదేవి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమాన్ని ఎప్పుడు నిర్వహిస్తారనే విషయాన్ని త్వరలో తెలియజేస్తామని తెలిపారు.
గణనీయంగా పెరిగిన మల్లేశ్వరుడి ఆదాయం
గణనీయంగా పెరిగిన మల్లేశ్వరుడి ఆదాయం
Comments
Please login to add a commentAdd a comment