
మహిళా ర్యాలీని విజయవంతం చేయాలంటూ విజయ చిహ్నం చూపిస్తున్న నగర మేయర్, డిప్యూటీ మేయర్‌లు
విజయనగరం: త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున విజయనగరం శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న కోలగట్ల వీరభద్రస్వామి, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బెల్లాన చంద్రశేఖర్‌లకు మద్దతుగా వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో శనివారం విజయనగరంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు కార్పొరేషన్ మేయర్ వి.విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణిలు వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ నగరంలో గతంలో ఎన్నడూ లేని విధంగా నిర్వహించ తలపెట్టిన ర్యాలీలో నియోజకవర్గంలోని మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శనివారం సాయంత్రం 5 గంటలకు నగరంలోని సీఎంఆర్ జంక్షన్ నుంచి కోట జంక్షన్ వరకు 6000 మంది మహిళలతో ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన యువభేరి, సీనియర్ సిటిజన్స్ సమ్మేళనం విజయవంతం కావడంతో మరింత ఉత్సాహంతో మహిళా ర్యాలీని చేపడుతున్నట్లు వివరించారు. సీఎంఆర్ జంక్షన్ వద్ద ప్రారంభమయ్యే ర్యాలీ ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచ్ జంక్షన్, డాబా గార్డెన్స్, కన్యకాపరమేశ్వరి కోవెల, గంటస్తంభం, మూడులాంతర్లు మీదుగా కోట జంక్షన్ వరకు సాగుతుందన్నారు. సమావేశంలో వైస్ ఎంపీపీ నిర్మల, వివిధ డివిజన్‌ల కార్పొరేటర్‌లు పిన్నింటి కళావతి, ఆశపు సుజాత, రేగాన రూపాదేవి, ఆల్తి సత్యకుమారి, పట్టా ఆదిలక్ష్మి, దుప్పాడ సునీత, దాసరి సత్యవతి, బొద్దూరు గోవిందమ్మ, నాయిన పద్మలతో పాటు వివిద డివిజన్‌ల మహిళా ఇన్‌చార్జిలు పాల్గొన్నారు.
విజయనగరంలో 6000 మందితో ప్రచారం
కార్పొరేషన్ మేయిర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రావణి
Comments
Please login to add a commentAdd a comment