ఒక్క అడుగు ముందుకు పడితే ఒట్టు...
సాలూరు: మండలంలోని సారిక – సొంపిగాం మధ్య సువర్ణముఖి నదిపై వంతెన నిర్మాణ పనులు ఎక్కడివక్కడ కూటమి పాలనలో నిలిచిపోయాయి. నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన ఇక్కడ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నాటి ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర ప్రత్యేక చొరవతో ఈ వంతెనను మంజూరు చేయించారు. అదే వేగంతో పనులకు శంకుస్థాపన కూడా చేశారు. అప్పట్లోనే సొంపిగాంకు బీటీ రోడ్డు మంజూరు చేయగా నిర్మాణ పనులు అప్పట్లోనే పూర్తయ్యాయి. ఇదే క్రమంలో 3 కోట్ల 87 లక్షల రూపాయిలతో మంజూరైన ఈ వంతెన పనులూ గత ప్రభుత్వంలో చకచకా చేపట్టారు. పిల్లర్ల వరకు నిర్మాణ పనులు జరిగాయి. ఇంతలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఎక్కడి పనులు అక్కడ నిలిచిపోయాయి. తొమ్మిది నెలలుగా పనులు చేపట్టకపోవడంతో ఈ పనులపై అనుమానాలు మొదలయ్యాయి. ఇక ఈ పనులు ముందుకు సాగుతాయా? లేదా? అనే ఆందోళన గిరిజనుల్లో నెలకొంది. ఈ వంతెన పనులు పూర్తి కాకుంటే వచ్చే వర్షాకాలంలో తమ గ్రామాలకు ఇబ్బందులు తప్పవని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. రాకపోకలకు కూడా ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం స్పందించి వెంటనే నిలిచిన చోట నుంచి పనులు పునఃప్రారంభించాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు.
కూటమి పాలనలో నిలిచిన సొంపిగాం వంతెన పనులు
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పూర్తయిన పిల్లర్ల పనులు
ఒక్క అడుగు ముందుకు పడితే ఒట్టు...
Comments
Please login to add a commentAdd a comment