మోసం చేయడం చంద్రబాబుకు అలవాటే
ఎన్నికల ముందు హామీలిచ్చి వాటిని అమలు చేయకుండా మోసం చేయడం చంద్రబాబుకు అలవాటే. 2014 సంవత్సరంలో ఎన్నికముందు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి నాడు మోసం చేశారు. నేడు ప్రతీ ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని, ఉద్యోగం వచ్చేంత వరకు నిరుద్యోగ భృతిని ఇస్తానని హామీ ఇచ్చారు. అధికారం చేపట్టిన పదినెలలు గడుస్తున్నా ఈ అంశంపై ఎటువంటి ప్రస్తావన లేదు. చంద్రబాబుకు నిరుద్యోగులను మోసం చేయడం అలవాటే.
– బి. ప్రవీణ్, నిరుద్యోగి, పార్వతీపురం అర్బన్
ఇదెక్కడి అన్యాయం
విద్యాదీవెన పథకం నిధులు విడుదల చేయాలని పలు మార్లు విన్నవిస్తున్నా ఫలితం లేకపోతోంది. ఇదెక్కడి అన్యాయం. ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఈ పథకంపై ఎటువంటి హామీ ఇవ్వకపోవడం బాధాకరం. అధికారులు స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలి
– పి.నవీణ్, విద్యార్థి
ఉద్యోగం రాక..
నేను డిగ్రీ పూర్తి చేశాను. ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రాకపోవడంతో కుటుంబ పోషణ కోసం విశాఖపట్నంలోని ఓ కంపెనీలో చేరాను. ఉద్యోగం వచ్చేవరకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానన్న నిరుద్యోగ భృతి ఇస్తే చదువుకునేందుకు కాస్త ఆర్థిక ఆసరా దొరికేది.
– ఎన్.మురళి, నిరుద్యోగి, తాడికొండ,
గుమ్మలక్ష్మీపురం మండలం
●
మోసం చేయడం చంద్రబాబుకు అలవాటే
మోసం చేయడం చంద్రబాబుకు అలవాటే
Comments
Please login to add a commentAdd a comment