మున్సిపల్ కార్మికుల మెరుపు సమ్మె
సాలూరు: జీతాల చెల్లింపు తదితర తమ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ పెద్దలు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని నిరసిస్తూ మున్సిపల్ కార్మికులు మెరుపు సమ్మె చేపట్టారు. మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సి పల్ వర్కర్స్‌అండ్ ఎంప్లాయీస్ యూనియన్(సీఐటీయూ) ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన చేపట్టారు. ప్రతి నెలా 1 నుంచి 5వ తేదీలోగా జీతాలు చెల్లించాలని, బకాయి ఉన్న ఫిబ్రవరి జీతం చెల్లించాలని డిమాండ్ చేశారు. చనిపోయిన కుటుంబాలకు బెని ఫిట్స్, ఉద్యోగాలు నేటికీ లేవన్నారు. మంత్రి సంధ్యారా ణి హామీ ప్రకారం సొంత నిధులతో ఇస్తామన్న సబ్బులు, నూనెలు, చెప్పులు, నేటికి ఇవ్వలేదని వాపోయారు. సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాగా సమ్మె విరమించాలని, జీతాలు చెల్లింపు చేస్తామని మున్సిపల్ చైర్‌పర్సన్ పువ్వల ఈశ్వరమ్మ, కమిషనర్ సత్యనారాయణలు కార్మికులకు సూచించగా తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు సమ్మె కొనసాగిస్తామని కార్మికులు స్పష్టం చేశారు. కార్యక్రమంలో నాయకులు ఎన్‌వైనాయుడు, రాముడు, శంకర్, రవి, కార్మికులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment