సాలూరులో కూటమికి షాక్
సాలూరు: అధికార కూటమి టీడీపీ, జనసేన పార్టీలకు సాలూరు పట్టణంలో షాక్ తగిలింది. పట్టణంలో 13, 17, 18 వార్డుల నుంచి పెద్ద సంఖ్యలో యువత ఆ పార్టీలను వీడి వైఎస్సార్‌సీపీలో చేరారు. వీరికి సాలూరులోని తన ఇంటివద్ద మాజీ డిప్యూటీ సీఎం, మాజీ గిరిజన సంక్షేమశాఖ మంత్రి పీడిక రాజన్నదొర పార్టీ కండువాలు వేసి సోమవారం సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో కిలపర్తి ఓంకేష్, వేలంగి ఫ్రేమ్, పూసర్ల దిలీప్, సంకుర్తి వెంకటేష్, బోను మనోజ్, దుర్గాసి బాలాజీ, పేకేటి తరుణ్, పి.సతీష్, ఎస్.గణేష్, జి.నవీన్, ఎల్.శ్రీను, కె.సతీష్, ఎస్.ప్రసాద్, ఎస్.కిరణ్, టి.యశ్వంత్, కె.లీలాప్రసాద్, జి.ధర్మరాజు, కె.వంశీ, సీహెచ్ తిరుపతి తదితరులు ఉన్నారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు ఈ నెల 12న జిల్లా కేంద్రంలో జరబోయే యువత పోరుకు తమ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రాజన్నదొర మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలుచేయకుండా ప్రజలను మోసంచేస్తోందన్నారు. అందుకే.. అనతికాలంలోనే కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందని, ప్రజలు, యువత వాస్తవాలను గ్రహించి వైఎస్సార్‌సీపీలో చేరడం శుభపరిణామమని తెలిపారు. యువత పోరు.. వైఎస్సార్‌సీపీ జోరుతో కూటమికి భవిష్యత్తులో బేజారు తప్పదన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ పువ్వల ఈశ్వరమ్మ, వైస్‌చైర్మన్ వంగపండు అప్పలనాయుడు, ప్రజాప్రతినిధులు, నాయకులు దాసరి మనోజ్, కొల్లి వెంకటరమణ, హరిబాలాజీ, గులిపల్లి నాగేశ్వరరావు, గిరిరఘు, తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీలో చేరిన టీడీపీ, జనసేన పార్టీల కార్యకర్తలు
Comments
Please login to add a commentAdd a comment